/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
Congress Won Thorrur And Jangaon Municipality
జనగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక(Janagama Municipal Chairman Election) ఉత్కంఠ భరితంగా సాగింది. గెలుపు ఎవరిని వరిస్తుందా అని ఎదురుచూసిన వేళ, చివరకు లాటరీ పద్ధతిలో కాంగ్రెస్(congress) అభ్యర్థి బాలమణి విజేతగా నిలిచారు. దీంతో జనగామ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది. మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ తరపున బాలమణి, బీఆర్ఎస్ తరపున గంజి రాజమణి పోటీ పడ్డారు. ఎన్నికల నేపథ్యంలో జనగామలో పోలీసులు భారీగా మోహరించారు. మున్సిపల్ కార్యాలయం చుట్టూ 144 సెక్షన్ అమలు చేశారు. ఇక అంతే ఉత్కంఠ భరితంగా సాగిన తొర్రూరు మున్సిపాలిటి(Thorrur Municipality) ని కూడా కాంగ్రెస్ లక్కీ డ్రాలో కాంగ్రెస్ దక్కించుకుంది. ఫలితం ప్రకటించగానే కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోగా, బీఆర్ఎస్ నేతలు నిరాశ చెందారు.
Also Read : బీఆర్ఎస్ ఖాతాలో మరో రెండు మున్సిపాలిటీలు
Also Read : సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి అదిరిపోయే శుభవార్త.. ఇక నుంచి ఆ బాధ పోయినట్లే!
Follow Us