Mahesh Kumar Goud : శనివారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ ఆదివారం ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యకుడు మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపడాన్ని నిరసిస్తూ ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద ధర్నాతో పాటు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Also Read: TG News: తెలంగాణలో భూములు కొనాలనుకుంటున్న వారికి బిగ్ షాక్.. మరో 2 నెలల్లో!
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ భారత్ బడ్జెట్ లాగా లేదని.. బీహార్ ఎన్నికల బడ్జెట్ లాగా ఉందని విమర్శలు గుప్పించారు. ఎన్నికల కోసమే బీహార్ కు నజరానాలు ఇచ్చారని.. తెలంగాణపై బీజేపీ వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. రాజకీయంగా తెలంగాణను దెబ్బతీయాలని బీజేపీ చూస్తోందన్నారు. 50.65 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్రం తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వలేదన్నారు.
Also Read: చనిపోయిన పేరెంట్స్ కు కుంభమేళాలో స్నానం.. ఆ కూతురు ఏం చేసిందంటే!-VIDEO VIRAL
త్వరలో బీహార్ లో ఎన్నికలు ఉండడంతో అక్కడ రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ కేంద్ర బడ్జెట్ ను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. దేశం మొత్తం ప్రజల నుంచి వసూలు చేసే బడ్జెట్లో అందరికి సమానంగా ఇవ్వాలన్నారు. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో గురజాడ అప్పారావు రాసిన దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే సూక్తిని వినియోగించారని.. అయితే తెలంగాణలో ఉన్న వాళ్లంతా మనుషులు కాదా అంటూ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణకు ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అడిగారు.
Also Read: ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్ రెబల్ స్టార్!
రైల్వే ప్రాజెక్టులు, విభజన హామీలు, పాలమూరు-రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టు జాతీయ హోదా, ఐటీఐఆర్, బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం లాంటి అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. రాష్ట్రం నుంచి రూ.40 వేల కోట్ల జీఎస్టీ నిధులు కేంద్రానికి వెళ్తున్నాయని.. ఆ మేరకు అయినా నిధులు తెలంగాణకు రావాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని వివక్ష చూపకూడదని.. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు సహకారం అందించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం అవలంభిస్తోన్న వివక్షను నిరసిస్తూ ఆదివారం నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు.