Congress Party : పార్టీ అధికార ప్రతినిధుల ఎంపికకు కాంగ్రెస్‌ వినూత్న నిర్ణయం..అభ్యర్థులకు పరీక్షలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అధికార ప్రతినిధుల ఎంపిక కోసం 'టాలెంట్‌ హంట్‌' పేరిట ఒక వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జాతీయ, రాష్ట్ర రాజకీయలపై పూర్తి అవగాహన, లౌకికవాదంపై పట్టు ఉన్న ప్రతిభావంతులను ఎంపిక చేసుకుంటారు.

New Update
FotoJet (99)

Congress' innovative decision to select party officials

Congress Party : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కొత్త అధికార ప్రతినిధుల ఎంపిక కోసం 'టాలెంట్‌ హంట్‌' పేరిట ఒక వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనల నుంచి పుట్టిన ఈ విధానం ద్వారా జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పూర్తి అవగాహన, లౌకికవాదంపై పట్టు, మంచి వక్తృత్వ నైపుణ్యాలు ఉన్న ప్రతిభావంతులను గుర్తించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రత్యేక సెలక్షన్‌ కమిటీకి టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తుండగా, ఇందుకు సంబంధించిన దరఖాస్తు బ్రోచర్‌ను టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ గాంధీభవన్‌లో అధికారికంగా విడుదల చేశారు.

ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా రానున్న 15 రోజుల పాటు ప్రత్యేక క్యూఆర్ కోడ్ ద్వారా ఔత్సాహికుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు. పార్టీ కార్యకర్తలతో పాటు రాజకీయాలపై ఆసక్తి ఉన్న తటస్థులు కూడా ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యాక, ప్రతి రెండు ఉమ్మడి జిల్లాలను ఒక యూనిట్‌గా పరిగణించి సెలక్షన్ కమిటీ పోటీ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇతర పార్టీల వారు ఇందులో చొరబడకుండా దరఖాస్తుదారుల నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి దశకు అనుమతిస్తారు.

జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి రాష్ట్ర స్థాయిలో తుది పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో చూపే ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను రాష్ట్ర అధికార ప్రతినిధులుగా, జిల్లా అధికార ప్రతినిధులుగా నియమిస్తారు. ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన వారికి రీసెర్చ్‌ విభాగం, పబ్లిసిటీ కో-ఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పగిస్తారు. ఇలా తుది ఎంపికైన అభ్యర్థులందరికీ పార్టీ తరఫున ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది.

Advertisment
తాజా కథనాలు