/rtv/media/media_files/2025/01/30/ItwGrapkLidrfU8sYH2V.jpg)
evening snacks Photograph: (evening snacks)
టెన్త్ విద్యార్థులకు (Tenth Class Students) కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ స్కూళ్లలో స్పెషల్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి (EV Narasimha Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని అన్ని ప్రభుత్వ స్కూళ్లతో పాటుగా మోడల్ స్కూల్ లో కూడా అమలు చేయనున్నారు. ఫిబ్రవరి1వ తేదీ నుంచి మార్చి 20 వరకు అమలు చేస్తామని ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఈవెనింగ్ స్నాక్స్ లో భాగంగా విద్యార్థులకు ఉడకబెట్టిన పెసర్లు, బబ్బర్లు, పల్లిపట్టి, మిల్లెట్ బిస్కెట్లు, ఉల్లిగడ్డ పకోడీ, ఉల్లిగడ్డ శనగలు అందించనున్నారు. దీనికోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ. 15 చొప్పున ఖర్చు చేయనుంది ప్రభుత్వం.
Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్
ప్రభుత్వ స్కూళ్లలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు గాను ప్రభుత్వం ఇప్పటికే స్పెషల్ క్లాసులు నిర్వహించాలని ప్లాన్ చేసింది. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం ఆరు, ఏడు దాకా స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు విద్యార్థులకు మధ్యాహ్నాం మిడ్ డే మీల్స్ అందిస్తుండగా, ఈవెనింగ్ ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారికి ఈవెనింగ్ విద్యార్థులకు స్నాక్స్ అందించాలని నిర్ణయించింది. ఈ నిధులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఖాతాల్లో వేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. వీటిని మిడ్ డే మీల్స్ ఏజెన్సీల ద్వారా చేయించాలని ఆదేశించారు.
Also Read : నరకం లాంటి జైల్లో వలసదారుల్ని వేస్తాం: ట్రంప్!
కాగా రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదటివారంలో గాని అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇక మార్చి 17 నుంచి 31 వరకు ఏపీ పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.
Also Read : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్
మార్చి 21 - ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 22 - సెకండ్ లాంగ్వేజ్
మార్చి 24 - ఇంగ్లీష్
మార్చి 26 - మ్యాథ్స్
మార్చి 28 - ఫిజిక్స్
మార్చి 29 - బయాలజీ
ఏప్రిల్ 2 - సోషల్ స్టడీస్
ఏప్రిల్ 3 - పేపర్-1 లాంగ్వేజ్ పరీక్ష (ఒకేషనల్ కోర్సు)
ఏప్రిల్ 4 - పేపర్-2 లాంగ్వేజ్ పరీక్ష (ఒకేషనల్ కోర్సు)
Also Read : పెళ్లి కోసం ఆరాటంగా వెళ్లిన వరుడు..తీరా అక్కడ ట్విస్ట్ మామూలుగా లేదుగా!