/rtv/media/media_files/2025/03/25/8dlVC1oLQURbYTYLBWe9.jpg)
Telangana Cabinet Expansion
తెలంగాణలో కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు బీసీలు, అలాగే ఒక రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో స్థానం లభించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏఐసీసీ.. రాష్ట్ర కోర్ కమిటీ నుంచి వివరాలు తీసుకుంది. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నుంచి అభిప్రాయాలను సేకరించింది.
Also Read: సెలబ్రిటీలకు 72 గంటలే టైం.. సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్!
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఇక బీసీలో ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్‌కు రానుంది. ఎస్సీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా రాష్ట్రంలో ఆరు మంత్రి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో నాలుగైదు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మైనార్టీలకు ఛాన్స్ ఇస్తే ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌కు చోటు దక్కే ఛాన్స్ ఉంది.
Also Read: షాకింగ్ ఘటన.. విమానాన్ని ఢీకొట్టి ఇంజిన్ లో పడిన పక్షి.. చివరికి ఏమైందంటే..!?
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సోమవారం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. కేబినెట్ విస్తరణపై చర్చించేందుకే వీళ్లను హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. వీటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే అన్ని జిల్లాల్లో మంత్రులు ఉంటే పార్టీకి కలిసొస్తుందని హైకమాండ్ భావిస్తోంది. ఉగాది పండుగ రోజున మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని సమాచారం అందుతోంది. మార్చి 27తో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఆ తర్వాత ఉగాది రోజున లేదంటే పండుగకు ఒకరోజు అటు ఇటుగా కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది .
Also Read: పార్లమెంట్‌లో చావా మూవీ.. స్పెషల్ స్క్రీన్‌లో వీక్షించనున్న మోదీ
cabinet-expansion | rtv-news