/rtv/media/media_files/2025/01/24/aiGM0ALJwuSc2sKQB2vp.jpg)
etela, padi Photograph: (etela, padi )
BRS MLA Kaushik Reddy: కరీనంనగర్(Karimnagar) జిల్లా కమలాపూర్(Kamalapur) ప్రజాపాలన గ్రామ సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామసభలో కాంగ్రెస్,బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్(BRS) నేతలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై(MLA Kaushik Reddy) కాంగ్రెస్ శ్రేణులు టమాటాలు విసిరారు. పోటాపోటీగా ఇరుపార్టీ కార్యకర్తల నినాదాలు చేసుకున్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసుల కమలాపూర్ గ్రామసభ దగ్గరికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇక కమలాపూర్ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Etela Rajender) సొంత ఊరు. 2004 ఎన్నికల్లో కమలాపూర్ నుంచి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం మల్కాజ్ గిరి నియోజవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు.
Also Read : నాలుగో రోజు కంటిన్యూ .. దిల్ రాజు ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు
కౌశిక్ రెడ్డి వెరైటీగా నిరసన..
ప్రజాపాలన గ్రామసభల్లో భాగంగా గురువారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెరైటీగా నిరసన తెలిపారు. వీణవంక మండలం చల్లూరు, జమ్మికుంట మండలం సైదాబాద్ లో జరిగిన గ్రామసభల్లో కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి నేలపై కూర్చుని గులాబీలు ఇచ్చి నిరసన చేపట్టారు. ధరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలను అందజేయాలంటూ దండం పెట్టి అధికారులను వేడుకున్నారు. అధికారంలోకి వస్తే రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పుడు 12వేలు ఇస్తామంటున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు కౌశిక్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్లు ఒక్కో నియోజకవర్గానికి 3 వేల 500 ఇస్తామని చెప్పి.. హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం కేవలం 306 ఇళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు ఆయన నిలదీశారు.
Also Read : ఆస్కార్‌కి ప్రియాంక చోప్రా ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ నామినేట్!
గ్రామ సభలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై టొమాటోలతో దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
— Telugu Scribe (@TeluguScribe) January 24, 2025
కమలాపూర్‌లో గ్రామసభలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి
బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య జరిగిన మాటల యుద్దం
బీఆర్ఎస్ నాయకులపై టొమాటోలు విసిరిన కాంగ్రెస్ కార్యకర్తలు pic.twitter.com/1oNJbm27x1
Also Read: ఎంత పని చేశావమ్మా.. భర్తను పోలీసులు తీసుకెళ్లారని
Also Read : భలే ఛాన్స్ మిస్.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!