/rtv/media/media_files/2025/02/16/zBC5owJ2Oqi9yqtgAzS7.jpg)
లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కులం, మతంపై కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబమని.. వాళ్లది హిందూ మతమని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చాక గాంధీ కుటుంబం కులమతాలను వదిలేసిందని, ఏ రోజు కూడా రాజకీయాల కోసం కులమతాలను వాడుకోలేదని చెప్పారు. రాహుల్ గాంధీ కుటుంబంపై ఎవరికీ అవగాహన లేదని.. బండి సంజయ్ తెలిసి మాట్లాడాడో.. తెలియక మాట్లాడాడో అర్థం కావడం లేదన్నారు. ఆదివారం గాంధీభవన్ లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడారు.
Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా
Also Read : Gold Prices: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్!
కులమతాలకు అతీతంగా నెహ్రూ కుటుంబం
తాను రెడ్డి అని, తన భార్య గౌడ్ అని పెళ్లాయ్యాక తన భార్య పేరు నిర్మలా జగ్గారెడ్డిగా మారిందన్నారు జగ్గారెడ్డి. హిందుమతం ప్రకారం.. భర్త కులమే భార్యకు వర్తిస్తుందని జగ్గారెడ్డి చెప్పారు. రాజీవ్ గాంధీ బ్రాహ్మిణ్ కాబట్టి సోనియా గాంధీది కూడా బ్రాహ్మణ కులం అయిందన్నారు. మోతీలాల్ నెహ్రూ, మహాత్మాగాంధీలు జంజం వేసుకున్నారని చెప్పారు. ఇందిరాగాంధీ భర్త పేరు ఫిరోజ్ గాండి అయితే గాండిని కాస్త గాంధీగా మార్చారని చెప్పారు. ఇంకోసారి రాహుల్ గాంధీ కులం, మతం గురించి మాట్లాడితే బండి సంజయ్ మాటకు విలువ ఉండదన్నారు. బండి సంజయ్ తో పాటుగా బీజేపీ నేతలు విమర్శలు చేసేముందు ఒకసారి హిస్టరీ చెక్ చేసుకోవాలని తెలిపారు జగ్గారెడ్డి. నెహ్రూ కుటుంబం కులమతాలకు అతీతంగా పనిచేస్తుందని తెలిపారు.
Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!
Also Read : పెయింటర్ కాదు పాపిష్టోడు.. భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం : సంగారెడ్డిలో దారుణం