కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలకు పోటాపోటీ?

తెలంగాణలో అయిదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ఖాళీ స్థానాల్లో నాలుగు కాంగ్రెస్‌కు దక్కనుండగా, ఒకటి బీఆర్‌ఎస్‌ కు దక్కనుంది. కాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలకు తీవ్ర పోటీ నెలకొంది. నాలుగిట్లో ఒక స్థానాన్ని మిత్రపక్షంగా ఉన్న సీపీఐ కు కేటాయించాల్సి ఉంది.

New Update
Gandhi Bhavan

Gandhi Bhavan

Congress MLC : తెలంగాణలో ఎమ్మెల్యే కోటాకు చెందిన అయిదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ఖాళీ స్థానాల్లో నాలుగు కాంగ్రెస్‌కు దక్కనుండగా, ఒకటి బీఆర్‌ఎస్‌ కు దక్కనుంది. కాగా కాంగ్రెస్‌ నాలుగు ఎమ్మెల్సీలకు తీవ్ర పోటీ నెలకొంది. నిజానికి నాలుగిట్లో మూడు మాత్రమే కాంగ్రెస్‌కు దక్కనుండగా, ఒక స్థానాన్ని మిత్రపక్షంగా ఉన్న సీపీఐ కు గతంలో ఇచ్చిన హామీ మేరకు కేటాయించాల్సి ఉంది. సీపీఐ మాజీ శాసనసభ్యుడు చాడా వెంకటరెడ్డికి ఈ స్థానం కేటాయించే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన మూడు స్ధానాల విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా సామాజిక వర్గాల పరంగా ఎంపిక జరగనుండగా అభ్యర్థుల ఎంపికపై ఎంపిక పైన హైకమాండ్ తో చర్చలు సాగుతున్నాయి. ప్రాంతీయ - సామాజిక సమీకరణాల ఆధారంగా రేవంత్ లిస్టు సిద్దమైంది.

Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు పైన రేవంత్ ఫోకస్ చేసారు. ఇప్పటికే అవకాశం ఎవరి కి ఇవ్వాలనే అంశం పైన చర్చలు జరిగాయి. నాలుగు సీట్లు కాంగ్రెస్ కు దక్కనున్నాయి. సీపీఐకు ఒక ఎమ్మెల్సీ సీటు ఖాయమైంది. సామాజిక సమీకరణాల ఆధారంగా ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో అద్దంకి దయాకర్ మాల సామాజిక వర్గ నేతకు మొదటి ప్రాధాన్యత దక్కుతుందని భావిస్తున్నారు. రేవంత్ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. అయితే, సామాజిక సమీకరణాల ఆధారంగా ఇప్పుడు అవకాశం దక్కకుంటే రాజ్యసభకు పంపే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 

 Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్‌ రిలీఫ్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం


రేసులో ముఖ్య నేతలు రెడ్డి సామాజిక వర్గం నుంచి జగ్గారెడ్డి, హరి వర్ధన్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డిలె ఎమ్మెల్సీకోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంబీసీల నుంచి మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌, చరణ్‌ కౌశిక్‌లు కూడా లైన్‌లో ఉన్నారు.. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వివాదం నడుస్తున్న నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి సీటు కేటాయించాలన్న అభిప్రాయం ఉంది. మాదిగ సామాజిక వర్గం నుంచి ప్రధానంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ రేసులో తొలి వరుసలో ఉన్నారు. ఇక మహిళా కోటాలో పారిజాత నర్సింహారెడ్డి, బాణోతు విజయాబాయి రేసులో ఉన్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని పార్టీ నూతన ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు. 

Also Read: Champions Trophy: బ్యాడ్ లక్ ఆఫ్ఘాన్..సెమీస్ కు ఆసీస్ 

 ఈ క్రమంలో సీఎం రేవంత్ మిత్రుడు కుసుమ కుమార్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టితో పాటుగా మంత్రి ఉత్తమ్ సైతం కుసుమ కుమార్ కు మద్దతు ఇస్తున్నారు. గత 30 ఏళ్ల కాలంగా కాంగ్రెస్ లో ఉన్న నేత కావటంతో.. ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. అదే విధంగా మైనార్టీ కోటాలో ఖమ్మం జిల్లాకు చెందిన నేత జావిద్ పేరు రేసులో ఉంది. ఈ ఆశావాహుల జాబితాతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో రేవంత్ చర్చలు చేస్తున్నారు. హైకమాండ్ ఆమోదం తీసుకున్న తరువాత తుది జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీదా కాంగ్రెస్‌ లో ఎమ్మెల్సీల కోసం సీనియర్‌ నాయకులు ఎవరికి వారే ప్రయత్నాలు చేసుంటున్నారు.

Also Read: HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు