Collector Transfer: కలెక్టర్ ట్రాన్స్‌ఫర్‌.. సంబురాలు చేసుకున్న జనం..ఎక్కడో తెలుసా?

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ అవ్వడంతో జిల్లాకు చెందిన గిరిజన, బీసీ సంఘాల నాయకులు సంబురాలు జరుపుకున్నారు. పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. కలెక్టర్‌ నిర్ణయాల వల్ల జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిందని వారు ఆరోపించారు.

New Update
FotoJet (9)

Collector transfer.. People celebrating.

Mahabubabad: రాజకీయ నాయకులు ప్రతి ఐదేళ్లకు ఒకసారి మారుతుంటారు. అయితే వారు ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే వారికి ప్రజలు తిరిగి అవకాశం ఇస్తారు. కానీ, అలా చేయకపోతే వారి రాజకీయ భవిష్యత్తుకు సమాధి కడుతారు. కానీ, అధికారులు అలా కాదు. ప్రభుత్వాలు మారినా, మారకున్న తరుచుగా బదిలీ అవుతుంటారు. అయితే తాము పనిచేసే కాలంలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే మాత్రం ప్రజలు వారిని గుండెల్లో పెట్టుకుంటారు. కానీ, ఈ మధ్య కొంతమంది అధికారులు ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే అధికారం అనుకుంటున్నారు. అలాంటి అధికారులు బదిలీ అవుతే మాత్రం ప్రజలు పండుగ చేసుకుంటారు. అలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

Also Read :  కాంగ్రెస్‌ ది దుర్మార్గమైన ప్రభుత్వం : కేటీఆర్

Collector Transfer - People Celebrating

Also Read :  ఫాల్కన్ గ్రూప్ మాజీ సీఓఓ వికాస్ కుమార్ సఖారే అరెస్ట్

మహబూబాబాద్ జిల్లా(mahaboobabad) కలెక్టర్(Collector Incident) అద్వైత్ కుమార్ సింగ్(Advait Kumar Singh) బదిలీ అవ్వడంతో జిల్లాకు చెందిన గిరిజన, బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గురువారం ప్రభుత్వ పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. అందులో భాగంగా మహబూబాబాద్ కలెక్టర్ కూడా బదిలీ అయ్యారు. దీంతో ప్రజలు ఆనందంతో పటాకులు కాల్చి పండుగ చేసుకున్నారు.కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జిల్లా అభివృద్ధిని అడ్డుకుని, జిల్లాను నాశనం చేశాడని వారు ఆరోపిస్తూ అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం సంచలనంగా మారింది. కలెక్టర్‌  నిర్ణయాల వల్ల జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

గత కొంతకాలంగా కలెక్టర్ పనితీరుపై గిరిజన, బీసీ, ప్రజాసంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.  ఆయన బదిలీ వార్త తెలియగానే రోడ్లపైకి వచ్చి సంబురాలు చేసుకున్నాయి.  గత రెండేళ్లుగా కలెక్టర్‌గా పనిచేసిన అద్వైత్ కుమార్, జిల్లా అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని వారు గిరిజన జిల్లా అయిన మహబూబాబాద్‌ను ఆయన తన నిర్ణయాలతో పదేళ్లు వెనక్కి నెట్టేశారని వారు విమర్శించారు. రైతుల భూ సమస్యలు, పట్టాదారు పాసుపుస్తకాల జాప్యం వంటి కీలక అంశాలను ఆయన గాలికి వదిలేశారని తీవ్రంగా దుయ్యబట్టారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంత్రులు ఇచ్చిన ఆదేశాలను కూడా కలెక్టర్ అమలు చేయలేదని, దీనివల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల గిరిజన జిల్లా ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశాయి. ఇప్పటికైనా జిల్లా సమస్యలను అర్థం చేసుకునే కొత్త కలెక్టర్ రావాలని వారు కోరుకున్నారు.

Advertisment
తాజా కథనాలు