CM Revanth : మహిళే యజమాని.. రేషన్ కార్డుపై సీఎం రేవంత్ గుడ్ న్యూస్! రేషన్, హెల్త్ కార్డులకు సంబంధించి మహిళలకు రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతి కార్డుపై మహిళే యజమానిగా ఉండనున్నట్లు తెలిపారు. ఒకే కార్డులో రేషన్, ఆరోగ్య, ఇతర పథకాల వివరాలు ఉండేలా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. By srinivas 28 Sep 2024 in తెలంగాణ నిజామాబాద్ New Update షేర్ చేయండి TG Ration Card : తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ మరో శుభవార్త చెప్పారు. మరో రెండు నెలల్లో అందించనున్న డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు (ఎఫ్‌డీసీ) సంబంధించి రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం.. కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాలని అధికారులకు సూచించారు. Also Read : పండగ సేల్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు! సంక్షేమ పథకాల్లోని డాటా ఆధారంగానే.. ఈ మేరకు ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రల్లో పర్యటించిన అధికారులు చేసిన అధ్యయనంపై శనివారం సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు, కార్డులతో కలిగే ప్రయోజనాలు, లోపాలను వివరించారు. దీంతో కార్డుల రూపకల్పనపై అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు చేశారు. ప్రస్తుతం ఉన్న రేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని డాటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ చేయాలని తెలిపారు. Also Read : హింస గురించి పాక్ మాట్లాడ్డం ఏంటో..యూఎన్‌లో భారత్ కౌంటర్ అనవసర సమాచారం అవసరం లేదు.. ఇక ఇతర రాష్ట్రాల కార్డుల రూపకల్పన, జారీలో ఉన్న మేలైన అంశాలను స్వీకరించాలని, లోపాలను సరిచూడాలన్నారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసర సమాచారం సేకరించాల్సిన పని లేదని చెప్పారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సమచార సేకరణ, వాటిల్లో ఏం ఏం పొందుపర్చాలి, అప్‌డేట్‌కు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో ఆదివారం సాయంత్రంలోగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహలతో కూడిన మంత్రివర్గ ఉప సంఘానికి అందజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. Also Read : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లు 119 శాసనసభ నియోజకవర్గాల్లో.. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో రెండు ప్రాంతాలు ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని సూచించారు. కుటుంబాల నిర్ధారణ, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వివరాలు అందుబాటులో ఉన్న డాటా ఆధారంగా అక్టోబరు మూడో తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో డోర్ టూ డోర్ పరిశీలన చేయించాలని ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టును పకడ్బందీగా చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గానికి ఆర్డీవో స్థాయి అధికారిని, పట్టణ ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారిని పర్యవేక్షణకు నియమించాలన్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఇటీవల వరదల సమయంలో వేసిన సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలన్నారు. Also Read : డీప్ ఫేక్ బిల్లును ఆమోదించిన దక్షిణ కొరియా #cm-revanth #congress #ration-cards మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి