'హైడ్రా ఆగదు.. అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదు' : సీఎం రేవంత్

హైదరాబాద్‌లో కొనసాగుతున్న హైడ్రా తీరుపై ప్రశ్నించిన వాళ్లపై అని సీఎం రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. హైడ్రా ఆగదని.. అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలు భయపడొద్దని వారికి అండ‌గా ఉంటానని భరోసా ఇచ్చారు.

New Update
cm revanth

హైదరాబాద్‌లో కొనసాగుతున్న హైడ్రా తీరుపై ప్రశ్నించిన వాళ్లపై అని సీఎం రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. చార్మినార్ వ‌ద్ద శనివారం రాజీవ్‌గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అజీజ్‌నగర్‌లో హరీశ్‌రావుకు ఫాంహౌస్‌ లేదా అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్‌ వల్లే హరీశ్‌రావుకు మంత్రి పదవి వచ్చిందని గుర్తు చేశారు. కేసీఆర్‌ కుటుంబానికి దోపిడీ చరిత్ర ఉందంటూ విమర్శలు చేశారు. 

Also Read: ఓఎల్‌ఎక్స్‌లో ప్రభుత్వ భూమి అమ్మకాలు.. తక్కువ ధరకే ఫ్లాట్లు!

రాష్ట్ర ఆర్థిక మూలలను దెబ్బ తీయాలని కొంత‌మంది కుట్రకు పాల్పడుతున్నారని, రియల్ ఎస్టేట్ సంస్థలు భయపడొద్దని వారికి అండ‌గా ఉంటానని సీఎం భరోసా ఇచ్చారు. హైడ్రా ఆగదని.. అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదంటూ పేర్కొన్నారు. హైడ్రా అనగానే హరీశ్‌, కేటీఆర్ బయటకు వచ్చి.. పేదలకు మేలు జరగడానన్ని చూసి ఓర్వలేకపోతున్నారంటూ మండిపడ్డారు. మూసీలో మగ్గిపోతున్న పేదలకు ఇళ్లు ఇచ్చి, వ్యాపారాలు చేసుకునేందుకు మహిళలకు ఆర్థిక సాయం అందించామని తెలిపారు. 

Also Read: కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు.. మరో 3 విమానాలకు.. 

 గుల్ఖాపూర్ నాలాను ఆక్రమించి కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టలేదా అంటూ ప్రశ్నించారు. ఈ ఫామ్ హౌస్‌కు బుల్డోజర్ వస్తుందనే ఇక్కడ వీళ్లు డ్రామా చేస్తున్నారంటూ విమర్శించారు. మూసీ పునరుజ్జీవనం వేరని హైడ్రా వేరని తెలిపారు. మూసీలో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని పేర్కొన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు, నాలాలను పునరుద్ధరించేదుకు, చెరువుల ఆక్రమణలకు అరికట్టేందుకే హైడ్రాను తీసుకువచ్చామని తెలిపారు. 

Also Read: లెబనాన్ డ్రోన్ దాడి.. బెంజమిన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

 బీఆర్ఎస్‌ నేతల తాపత్రయం వాళ్ల ఆస్తులు కాపాడుకునేందుకేనంటూ సెటైర్లు వేశారు. ఎప్పుడైనా ఫామ్ హౌస్ కు రమ్మని సవాల్ చేశారా అంటూ రేవంత్‌ ప్రశ్నించారు. వాళ్ల ఫామ్ హౌస్‌ల వద్దకు ఎప్పుడు రావాలో హరీశ్‌ రావు చెప్పాలని అన్నారు. హరీశ్, కేటీఆర్ ఫామ్ హౌస్‌ల విషయంపై అఖిలపక్షం పిలుద్దామని.. నిజ నిర్ధారణ కమిటీతో నిజాలు నిగ్గు తేలుద్దామని తెలిపారు. 

Also Read: స్పెషల్ చికెన్‌.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం!

Advertisment
Advertisment
తాజా కథనాలు