చట్టానికి ఎవరూ అతీతులు కాదు.. RS ప్రవీణ్ చరిత్ర ఇది.. బండి భగీరథ్ ఇష్యూపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌.. ఈ వ్యవహారంపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు.

New Update
CM Revanth

CM Revanth

బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌.. ఈ వ్యవహారంపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  '' బండి సంజయ్ కొడుకుపై పేట్ బషీరాబాద్ స్టేషన్‌లో అమ్మాయి తల్లి ఫిర్యాదు మేరకు మే 8న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 

అంతకు ముందే కరీంనగర్‌లో బండి సంజయ్ కొడుకు వాళ్లపై కేసు పెట్టాడు.9,10 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటన వల్ల 10 వేల మంది పోలీసులు భద్రతలో నిమగ్నమయ్యారు. డీజీ నుంచి కింద స్థాయి అధికారుల వరకు అందరూ ఈ భద్రతలోనే ఉన్నారు. ఇప్పుడు విచారణ మొదలైంది. పోలీసులు చర్యలు తీసుకుంటారు. బీఆర్ఎస్ వాళ్లు కోరుకున్నట్లు క్షణాల్లో ఈ చర్యలు జరగవు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అన్న విషయాన్ని మరిచిపోవద్దు.

Also Read: తమిళనాడు పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్..  స్టాలిన్ ఇంటికి సీఎం విజయ్!

సీనియర్ ఉమెన్ ఆఫీసర్‌ను విచారణ అధికారిగా నియమించి విచారణ చేయాలని డీజీపీని ఆదేశించాం. బాధితులను కలిసి స్టేట్‌మెంట్ తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసింది పోలీసులే.ఈ విషయం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు తెలియదా. చట్టానికి ఎవరూ కూడా అతీతులు కాదు. ఎవర్నీ మేం ఇప్పటిదాకా వదిలిపెట్టలేదు. చట్టం తన పని తాను చేస్తుంది. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు.

కేటీఆర్ బామ్మర్థి ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ తీసుకుని దొరికినా వదలలేదు. ఖాళీగా ఉన్నామని కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డ్యూటీ చేస్తామంటే ఎలా ?. బీఆర్ఎస్ హయాంలో నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పై విచారణ జరిపితే ప్రభాకర్ రావు నీతిమంతుడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు..అది ఆయన నీతి.  గడీలు బద్దలు కొడతానని గతంలో ప్రవీణ్ కుమార్ అన్నారు. 

Also Read: పాత ప్రేమ చిగురించిందని వెళ్తే.. ప్రాణాలు తీసిన భర్త!

మైక్‌ల ముందు స్టేట్ మెంట్లు ఇచ్చే నాయకుల ఆధారంగా కేసుల విచారణ జరగదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర ఆధారాలు ఉంటే పోలీస్ కమిషనర్ కు ఇవ్వొచ్చు. మోదీ సభకు 48 గంటల ముందే బండి భగీరథ్ పైన పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మైనర్ బాలిక కు సంబంధించిన అంశంలో అంతా బాధ్యతాయుతంగా ఉండాలని'' సీఎం రేవంత్ అన్నారు.

Advertisment
తాజా కథనాలు