Revanth Reddy: రెండింటికి ముడిపెట్టడం సరికాదు.. ప్రధాని మోడీకి సీఎం రేవంత్‌ రెడ్డి లేఖ!

మహిళా రిజర్వేషన్ల అమలు, డీలిమిటేషన్ అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గళమెత్తారు. ప్రధాని మోడీకి ఆయన ఓ లేఖ రాశారు. మహిళా బిల్లు అమలు డీలిమిటేషన్‌తో ముడిపెట్టడంతో అన్యాయం జరుగుతుందని, ఈ రెండింటినీ వేర్వేరు అంశాలుగా పరిగణించాలని ఆయన స్పష్టం చేశారు.

New Update
revanth reddy

revanth reddy Photograph: (revanth reddy)

Revanth Reddy: మహిళా రిజర్వేషన్ల అమలు, డీలిమిటేషన్ అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గళమెత్తారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ఒక సమగ్రమైన లేఖ రాశారు. మహిళా బిల్లు అమలును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడంతో అన్యాయం జరుగుతుందని, ఈ రెండింటినీ వేర్వేరు అంశాలుగా పరిగణించాలని ఆయన స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళా కోటాను అమలు చేయడాన్ని దేశమంతా స్వాగతిస్తోందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకూడదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల వారీగా అసెంబ్లీ స్థానాల్లో మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా సాధికారతకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని డీలిమిటేషన్ ప్రక్రియతో అనుసంధానం చేయడంతో అమలులో జాప్యం జరుగుతుందని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

Also Read: ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా..? 90's కుర్రాళ్ల కలలరాణి.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వొద్దు

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు, చిన్న రాష్ట్రాలకు ఈ విధానం వల్ల అన్యాయం జరుగుతుంది. ఈ ప్రక్రియ తాత్కాలికంగా బీజేపీ వంటి కొన్ని రాజకీయ పార్టీలకు ప్రయోజనం చేకూర్చవచ్చని, కానీ దీర్ఘకాలంలో దేశ సమగ్రతకు నష్టం కలిగిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే సుప్రీం అని ఆయన గుర్తుచేశారు.

Also Read: రక్తంతో తడిసి ముద్దైన రోడ్లు.. యాక్సిడెంట్‌లో 18 మంది మృతి

ప్రత్యామ్నాయ నమూనాలపై చర్చించాలి

కేవలం జనాభా నిష్పత్తిని మాత్రమే ప్రామాణికంగా తీసుకోకుండా, ఇతర ప్రత్యామ్నాయ నమూనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించాలని కోరారు. అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ, సమగ్ర చర్చల తర్వాతే డీలిమిటేషన్‌పై ముందడుగు వేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

Advertisment
తాజా కథనాలు