PM Modi vs CM Revanth: ప్రధాని మోదీకి సీఎం రేవంత్ మాస్ కౌంటర్!

తెలంగాణలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని మోదీ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన రెండో రోజే రెండు హామీలను అమలు చేశామని.. అలాగే రైతులకు రూ.2 లక్షల లోపు మాఫీ చేశామంటూ ట్వీట్ చేశారు.

New Update
modi revanth
PM Modi vs CM Revanthతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అనేక హామిలున్ ఇచ్చిందని.. కానీ అవి అమలు చేయడంలో విఫలమైందని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ట్విట్టర్ లో.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7, 2023లో అధికారంలోకి వచ్చిందని అన్నారు. సీఎం తాను బాధ్యతలు తీసుకున్న రెండో రోజే ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండు హామీలను అమలు చేశామని అన్నారు. అందులో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. రెండోది ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10లక్షలకు పెంచమని అన్నారు. తమ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని అన్నారు. త్వరలోనే మిగతా హామీలను కూడా అమలు చేస్తామన్నారు.

ప్రియమైన నరేంద్రమోదీ జీ అంటూ....

ప్రియమైన నరేంద్రమోదీ అంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు తమ ప్రభుత్వం మీకు ఉన్న అపోహలను తొలిగిస్తానన్నారు. డిసెంబర్ 7, 2023 నుండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది అన్నారు. బాధ్యతలు స్వీకరించిన రెండు రోజుల్లోనే, తెలంగాణ ప్రభుత్వం తన మొదటి, రెండవ  ఎన్నికల వాగ్దానాన్ని - అన్ని TGSRTC బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఆరోగ్య సంరక్షణ & ఆసుపత్రి కవరేజీని విడుదల చేసిందని అన్నారు. 

ఇది కూడా చదవండి: అప్పటి నుంచే FREE BUS.. మంత్రి సంచలన ప్రకటన

గత 11 నెలల్లో తెలంగాణాలోని మన సోదరీమణులు, తల్లులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రయాణించారు, రాష్ట్రవ్యాప్తంగా 101 కోట్లకు పైగా ఉచిత బస్సు యాత్రలను చేపట్టి, ఒక సంవత్సరం లోపు రూ. 3,433.36 కోట్లు ఆదా చేశారు. తమ మొదటి సంవత్సరం పూర్తి కాకముందే, మేము రైతే రాజు (తెలంగాణలో రైతు రాజు)కి భరోసా ఇస్తూ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్ర స్థాయి రైతు రుణమాఫీని అమలు చేసినట్లు చెప్పారు.  22 లక్షల 22 వేల మంది రైతులు (22,22,365) ఇప్పుడు ఎలాంటి రుణం లేకుండా, రాజులా జీవిస్తున్నారని.. రూ. 2,00,000 వరకు రైట్‌ల రుణాలన్నీ మాఫీ చేయబడ్డాయని అన్నారు. 25 రోజుల్లో 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. 

Also Read: వైఎస్‌ ఫ్యామిలీ రెండు ముక్కలు.. వారందరి సపోర్ట్ జగన్ కే!

 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ ఛార్జీ లేకుండా ఉచిత విద్యుత్ అందుతున్నందున మహిళలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఎక్కువగా ఉంటే, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న తెలంగాణలో కేవలం 500 రూపాయలకే సిలిండర్‌ లభిస్తుండడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తమ హయాంలో ఇప్పటివరకు 1.31 కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్ రీఫిల్‌లు జరిగాయని చెప్పారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు