బీఆర్ఎస్‌ పేద పిల్లలకు విద్యను దూరం చేసింది.. కేసీఆర్‌పై రేవంత్ ఫైర్

తెలంగాణలో ప్రతీఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని సీఎం రేవంత్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్‌కు సీఎం రేవంత్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్‌ పేద పిల్లలకు విద్యను దూరం చేసిందని మండిపడ్డారు.

New Update

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్‌కు సీఎం రేవంత్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రతీఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమన్నారు.'' తెలంగాణలో విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించాలని మేం భావిస్తున్నాం. నిరుద్యోగ సమస్య పరిష్కారంతో పాటు నాణ్యమైన విద్య, నిరుపేదలకు వైద్యం అందిస్తామని మాట ఇచ్చాం. 

గత ప్రభుత్వం పేద పిల్లలకు విద్యను దూరం చేసే ప్రయత్నం చేసింది. రాష్ట్రంలో 5 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసింది. పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాశాఖను సమూలంగా ప్రక్షాళన చేయాలని  మేం భావించాం. అందుకే టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వంపై నమ్మకం కలిగించాం. రూ.22లక్షల కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేసిన కేసీఆర్.. ప్రభుత్వ పాఠశాలలల్లో మౌలిక వసతుల కోసం కనీసం రూ.10వేల కోట్లు ఖర్చు చేయలేదు.

Also Read: టాటా గ్రూప్స్ వారసుడొచ్చేశాడు.. నోయెల్ టాటా గురించి ఆసక్తికర విషయాలు

పేదలకు విద్యను దూరం చేయాలన్న కుట్రతోనే కేసీఆర్ రూ.5 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు. కానీ పేదలకు విద్యను చేరువ చేసేందుకే మా ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తోంది. 1972లో పీవీ నర్సింహారావు రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని తీసుకొచ్చారు. పీవీ దార్శనిక ఆలోచనతో బుర్రా వెంకటేశం లాంటివారు ఐఏఎస్ స్థాయికి ఎదిగగలిగారు. గత ప్రభుత్వం పేదలకు విద్యను అందించేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేము చేస్తుంటే తప్పుపడుతున్నారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే నాకు గౌరవం ఉంది. ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా నాకు అభ్యంతరం లేదు. కానీ కోట్లాది రూపాయలతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్  స్కూల్స్ ఏర్పాటు చేస్తుంటే ఎందుకు తప్పుపడుతున్నారు ?. ఏ దొరలు.. పేదలకు విద్య, వైద్యం దూరం చేశారో ఆ దొరల పక్కన చేరి బలహీన వర్గాలకు మంచి చేస్తే విమర్శలు చేస్తున్నారు. ఒక్కో స్కూల్‌ భవనాన్ని రూ.25 కోట్లతో 150 ఎకరాల్లో నిర్మిస్తున్నాం.

కేసీఆర్ చెప్పినట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గొర్రెలు, బర్రెలు కాసుకుని బతకాలా ?. మేం అధికారంలోకి రాగానే 90 రోజుల్లో 30వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. గురువారం11వేల మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించాం. కుల మతాల మధ్య వైషమ్యాలు తొలగొంచడమే మా విధానం. కానీ వాళ్ల కుటుంబ సభ్యులే రాజ్యాలు ఏలాలనేది కేసీఆర్ విధానం. మీ పిల్లలు రాజ్యాలు ఏలాలి కానీ.. పేదల పిల్లలు బర్రెలు, గొర్రెలు కాసుకోవాలా ?. బలహీన వర్గాలకు అవకాశాలు కల్పించినన పార్టీ కాంగ్రెస్.

Also Read: ఆ వ్యూహమే బీజేపీని మళ్లీ మళ్లీ గెలిపిస్తోందా ?

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండు సున్నా ఇచ్చినా వారికి జ్ఞానోదయం కాలేదు. వాళ్లకు జ్ఞానోదయం కాకపోయినా ఫర్వాలేదు. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఏమైందో అర్ధం కావడం లేదు. రాష్ట్రంలోని 1023 రెసిడెన్షియల్ స్కూల్స్‌లో కేసీఆర్ పాలనలో కనీస మౌలిక వసతులు కల్పించలేదు. 33 జిల్లాల్లో ప్రభుత్వ స్థలాన్ని దిగమింగి కేసీఆర్ పార్టీ భవనాలు కట్టుకున్నారు. పార్టీ కార్యాలయాల నిర్మాణానికి భూమి, పైసలు ఉన్నయ్ కానీ.. పిల్లలకు బడికి మౌలిక వసతులు కల్పించాలన్న ఆలోచన ఆయనకు రాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వేరుగా ఉంటే వారి మనసుల్లో విషం నిడుతుతుంది. అందుకే కుల మతాలకు అతీతంగా కలిసి ఉండాలనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని'' సీఎం రేవంత్ అన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు