CM Revanth Reddy : ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాకిచ్చారు.  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాలేదని..  డీఏల పెంపు ఇప్పట్లో కుదరదని స్పష్టం చేశారు.  ప్రతినెల ఒకటో తారీఖు జీతాలివ్వడానికే తల ప్రాణం తోకకొస్తుందని అసెంబ్లీ వేదికగా వెల్లడించారు.

New Update
cm revanth reddy

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాకిచ్చారు.  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాలేదని..  డీఏల పెంపు ఇప్పట్లో కుదరదని స్పష్టం చేశారు.  ప్రతినెల ఒకటో తారీఖు జీతాలివ్వడానికే తల ప్రాణం తోకకొస్తుందని అసెంబ్లీ వేదికగా వెల్లడించారు.  మొన్న రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుని..  ఒకటో తేదీన జీతాలిచ్చామన్నారు సీఎం.  డీఏలు, కరవు భత్యం అనకుండా ఒకటో తేదీన జీతాలు తీసుకొని సేవలు అందించాలని ఉద్యోగులను సీఎం రేవంత్ కోరారు.  ప్రభుత్వంపై నిరసన తెలపాలనుకుంటే.. రోజుకు 2,3 గంటలు ఎక్కువ పనిచేయాలని సూచించారు.  మీరు ఆదాయం పెంచుతే, మేం పేదలకు పంచుతామని రేవంత్ స్పష్టం చేశారు.  

మార్చి 31లోగా రైతు భరోసా..

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమిలేని నిరుపేదలకు రూ.12 వేలు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. సన్నవడ్లకు బోనస్ రూ.1,206 కోట్లు ఇచ్చామని..  260 లక్షల టన్నుల వరి ఉత్పత్తి చేసి దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా  నిలిచిందన్నారు. కాళేశ్వరం కట్టడం.. కూలడం.. రూ. లక్షకోట్లు ఆవిరి మూడేళ్లలో జరిగిందన్నారు.  కాళేశ్వరం లేకుండా ఒకే సీజన్లో కోటి 56 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండించి దేశానికి ఆదర్శంగా మన రైతులు నిలిచారని సీఎం చెప్పుకొచ్చారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వారి ఖాతాల్లో నగదు బదిలీ చేశామని రేవంత్ రెడ్డి  పేర్కొన్నారు. అధికారం చేపట్టిన 10 నెలల్లోనే రూ.20,617 కోట్లు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదని చెప్పారు. మార్చి 31లోగా అందరి ఖాతాల్లో రైతు భరోసా జమచేస్తామని వెల్లడించారు.

అందుకే కులగణనలో పాల్గొనలే

దొంగ ఆస్తులు బయటపడతాయనే భయంతోనే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు కుల గణన సర్వేలో పాల్గొనలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాము ప్రభుత్వ ఉద్యోగులతో కుల గణన చేయించామని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే ఎవరితో చేయించారో కేసీఆర్ చెప్పగలరా? అని ప్రశ్నించారు. సర్వే తప్పు అంటే 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు రావని అన్నారు. ఇదొక కుట్ర అని తెలిపారు. మాదిగ, మాదిగ ఉపకులాలు రాష్ట్రంలో ఉన్నదే 59 అని.. ఆ సొక్క మాయిన సర్వేచేస్తే 82 కులాలని తేలాయని కేసీఆర్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ కులాలను ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు. నిజంగానే తెలంగాణ రక్తం కేసీఆర్ లో ప్రవహించి ఉంటే 'జయ జయహే తెలంగాణ'ను రాష్ట్ర గీతంగా ఎందుకు తీసుకురాలేదని, సెక్రటేరియెట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తే దుఃఖం ఎందుకు వస్తున్నదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Also Read :  మ్యాట్రీమోనీతో వల.. రెండో పెళ్లి, ఆంటీలనే టార్గెట్ చేస్తూ..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు