CM Revanth Reddy : ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాకిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాలేదని.. డీఏల పెంపు ఇప్పట్లో కుదరదని స్పష్టం చేశారు. ప్రతినెల ఒకటో తారీఖు జీతాలివ్వడానికే తల ప్రాణం తోకకొస్తుందని అసెంబ్లీ వేదికగా వెల్లడించారు.