CM Revanth: అల్లు అర్జున్ అసలు నువ్వు మనిషివేనా? సభలో సీఎం రేవంత్ ఫైర్

సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ కారణంగానే జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అతడు రాకపోతే తొక్కిసలాట జరిగేది కాదని, రేవతి కుటుంబం నష్టపోయేది కాదంటూ అసెంబ్లీలో మండిపడ్డారు. బాధ్యులెవరైనా వదిలేది లేదని, చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

author-image
By srinivas
New Update
Revanthh

TG News : సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ కారణంగానే జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అతడు రాకపోతే తొక్కిసలాట జరిగేది కాదని, రేవతి కుటుంబం నష్టపోయేది కాదంటూ అసెంబ్లీలో మండిపడ్డారు. బాధ్యులెవరైనా వదిలేది లేదని, చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ర్యాలీగా వెళ్లడం వల్లే దారుణం.. 

ఈ మేరకు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారు. అతను రోడ్ షో చేయడం వల్లే భారీగా అజాన్ థియేటర్ కు వచ్చారు. థియేటర్ కి రావొద్దని పోలీసులు చెప్పినా వినలేదు.అల్లు అర్జున్ అసలు మనిషేనా? అసలు ఏం మనిషి ఇతను.. ప్రపంచంలో ఇలాంటి మనుషులు ఉంటారా? డీసీపీ వచ్చి బలవంతంగా అల్లు అర్జున్‌ని కారులో ఎక్కించే వరకు థియేటర్‌లోనే కూర్చున్నాడు. అల్లు అర్జున్ రిటర్న్ వెళ్తుంటే కూడా కారు రూఫ్ టాప్ నుండి బయటకి వచ్చాడంటూ ఫైర్ అయ్యారు. మరోవైపు సభలో అల్లు అర్జున్‌పై అక్బరుద్దీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల దగ్గరకు వెళ్లాలన్న బాధ్యత అల్లు అర్జున్‌కు లేదా అంటూ తీవ్ర విమర్శలు చేశారు. 

ఇది కూడా చదవండి: Viral: కాళేశ్వరం కాదు.. కూళేశ్వరం: కోమటిరెడ్డి సెటైర్లకు సీఎం నవ్వులే నవ్వులు!

ఏసీపీ వెళ్లిపోవాలని చెప్పినా వినలేదు..

బౌన్సర్లు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. సినిమా ముందే ఇద్దరు చనిపోయారని చెప్పినా అల్లు అర్జున్ మూవీ మొత్తం చూసి వెళ్లాడు. పోలీసులను అతని దగ్గరకు సినిమా యాజమాన్యం వెళ్లనివ్వలేదు. ఏసీపీ వెళ్లిపోవాలని చెప్పినా అతడు వినలేదు. అందుకే థియేటర్ తోపాటు హీరోపై కూడా పోలీసులు కేసులు పెట్టారు. అయినా అంత డబ్బులు ఖర్చుచేసి సినిమా చూసేందుకు వచ్చి రేవతి చచ్చిపోతే ఆమె కుటుంబాన్ని చూడటానికి కూడా వెళ్లలేదు. అల్లు అర్జున్ కు ఏమైనా అయిందా? కన్ను పోయిందా? కాలు పోయిందా? రూప్ టాప్ మీద ఎక్కి చేతులు ఊపుతూ వెళ్లాడు. అతనివల్లే రేవతి కుటుంబం నష్టపోయింది. ఇకనుంచి బెన్ ఫిట్ షోలకు అనుమతులు ఇవ్వమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read :  చీరలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా.. ముసిముసి నవ్వులు చిందిస్తూ

పోలీసులు అనుమతి ఇవ్వలేదు..

సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్ కు వెళ్లారు. అతను కేవలం థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదు. కానీ థియేటర్ కు వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లారు. దీంతో పక్కన ఉన్న అన్ని థియేటర్ల నుంచి ఒక్కసారిగా పబ్లిక్ సంధ్య థియేటర్ వైపు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో తల్లి రేవతి చనిపోయింది. ఆమె కొడుకు కోమాలోకి వెళ్ళాడు. అంత తొక్కిసలాటలో కూడా ఆ తల్లి కొడుకు చేయి విడిచిపెట్టలేదు. బిడ్డపై తల్లి ప్రేమ అలాంటిది. కొడుకు చేయి పట్టుకుని ఆ తల్లి చనిపోయింది. హీరో థియేటర్ లోపల ఉండటం వల్ల లోపల కూడా తొక్కిసలాట జరిగింది. ఈ విషయాన్ని హీరోకు ఏసీపీ చెప్పినా.. శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని చెప్పినా హీరో వినలేదని పోలీసులు చెప్పినట్లు తెలిపారు. 

Also Read :  తెలంగాణలో స్కూల్లో దారుణం.. ప్యాంట్ జిప్ వేసుకోలేదని స్టూడెంట్‌ను!

ఏమీ అనొద్దు అంటే ఇదేం న్యాయం..

ఇక బయటకు వెళ్లడానికి హీరో ఒప్పుకోలేదని సిటీ కమిషనర్ చెప్పారు. దీంతో డీసీపీ వెళ్లి అక్కడ నుంచి కదలకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించి హీరోను కారు ఎక్కించారు. అయినా వెళ్ళేటప్పుడు కూడా కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేస్తూ వెళ్లారు. ఈ నేపథ్యంలో హీరోపై, యాజమాన్యం పై పోలీసులు కేసు పెట్టారు. బాధ్యత రహితంగా సమాధానాలు ఇవ్వడం వల్లే పోలీసులు వారి విధి నిర్వహించారు. ఈ ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికత్వం ప్రదర్శించాయి. తన కొడుకు ఆ హీరో అభిమాని అని కొడుకు కోసం ఒక్కో టికెట్ రూ.3వేల చొప్పున రూ.12వేలు పెట్టి ఆ కుటుంబం సినిమా టికెట్లు కొన్నారు. థియేటర్ లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ పిల్లవాన్ని హీరో పరామర్శించలేదు. అలాంటి మానవత్వం లేని వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే పదేళ్లు మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. చావుకు కారణమైన వారిని పోలీస్ స్టేషన్ కు పిలిస్తే.. తప్పు పట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఎంతో నీచమైన భాష వాడారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని భావించి మా ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. ప్రాణాలు బలి తీసుకుంటే వాళ్లను ఏమీ అనొద్దు అంటే ఇదేం న్యాయం. సినీ, రాజకీయ ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఏమైనా చేస్తారా? అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి లోబడే మా ప్రభుత్వం నడుచుకుంటోంది. జైలుకు వెళ్లి వచ్చిన హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖుల్లో బాధిత కుటుంబాన్ని ఒక్కరైనా కలిసారా. సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం కోరుకుంటున్నరో తెలియడం లేదు. వ్యాపారాలు చేసుకోండి కానీ ప్రాణాలతో చేలాగాటమాడటానికి మేం ఒప్పుకోము. మేం అధికారంలో ఉన్నంత కాలం అలాంటి ఆటలు సాగవని హెచ్చరించారు. 

Also Read :  జగనన్న కటౌట్ చూసినా మీకు భయమే.. పవన్, బాబుపై రోజా మాస్ సెటైర్లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు