/rtv/media/media_files/fr8CDEc1VsCf25rMeX73.jpg)
తొలిసారిగా సీఎం రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్ ఒకే వేదికపైకి రానున్నారు. త్వరలోనే ఓ కార్యక్రమంలో ఇద్దరూ వేదిక పంచుకోనున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 21న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారం సంస్మరణ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం నేతలు సీఎం రేవంత్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఈ సభకు ఆహ్వానించారు. దీంతో ఈ కార్యక్రమానికి ఈ ఇద్దరు నేతలు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో రేవంత్, కేటీఆర్ మీటింగ్ ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇద్దరూ ఈ సభకు వస్తే.. వేదికపై ఎలాంటి సీన్లు కనిపిస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.