TG News: చేనేత కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించన సందర్భంగా చేనేత కార్మికుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ చేనేత అభయహస్తం పథకం ప్రకటించారు. అంతేకాదు తెలంగాణ చేనేత అభయహస్తం పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో తెలంగాణ చేనేత అభయహస్తం పథకం అమలుకు నిధులను విడుదల చేయనుంది. రూ.31 కోట్ల వేతన ప్రోత్సాహాకాలు.. ఈ మేరకు తెలంగాణ నేతన్న పొదుపు (త్రిఫ్ట్ ఫండ్) కోసం రూ.15 కోట్లు, పవర్‌లూమ్స్, బకాయిలకు-రూ.15 కోట్లు, నేతన్న భద్రత (నేతన్న బీమా) కోసం రూ.5.25 కోట్లు, నేతన్న భరోసాకు రూ.31 కోట్ల వేతన ప్రోత్సాహాకాలు రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇక నేతన్న పొదుపు పథకం జియో-ట్యాగ్ తో అనుసంధానమైన మగ్గాల చేనేత కార్మికులు, అనుబంధ కార్మికుల సంక్షేమానికి రూపొందించింది. చెప్పారు. ఇది కార్మికుల్లో పొదుపు అలవాటును ప్రోత్సహించడంతో పాటు వారికి సామాజిక భద్రత కల్పించనుంది. ఇక చేనేత కార్మికులు/అనుబంధ కార్మికులు వారి వేతనాల నుంచి దీనికి నెలవారీగా 8 శాతం కాంట్రిబ్యూషన్ చేస్తారు. కాంట్రిబ్యూషన్ గరిష్ట పరిమితి రూ.1200. ఇందుకు ప్రభుత్వం రెండింతలు అధికంగా 16 శాతం అందిస్తుంది. దీంతో దాదాపు 38 వేల మంది నేత కార్మికులు లబ్ధి పొందనున్నారు. ఈ పథకం 15 వేల మంది మర మగ్గాల కార్మికులకూ వర్తిస్తుంది. మర మగ్గాల కార్మికులు తమ వేతనం నుంచి నెలవారీగా 8 శాతం జమ చేస్తారు. వారి గరిష్ట పరిమితి రూ.1200. ప్రభుత్వం వారి కాంట్రిబ్యూషన్‌కు సమానంగా 8 శాతం కాంట్రిబ్యూషన్ చేస్తుంది. రికరింగ్ డిపాజిట్ వ్యవధి మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు తగ్గించింది. తెలంగాణ నేతన్న భీమా.. తెలంగాణ నేత భద్రత పథకం రాష్ట్రంలోని జియో ట్యాగింగ్ అయిన మొత్తం చేనేత, మర మగ్గాల కార్మికులు, అనుబంధ కార్మికులకు వర్తిస్తుంది. తెలంగాణ నేతన్న భద్రతలో నమోదైన కార్మికుడు ఏ కారణం చేత మృతిచెందినా రూ.5 లక్షల మొత్తం అతని నామినీకి అందుతుంది. తెలంగాణ చేనేత కార్మికుల సహకార సంఘం ద్వారా బీమా కవరేజీ అందరికీ వర్తిస్తుంది. ఈ పథకంలో ఇప్పటి వరకు ఉన్న 65 ఏళ్ల గరిష్ట వయో పరిమితిని ఎత్తివేశారు. 59 ఏళ్లు దాటిన వారికి ఇది వర్తిస్తుంది. ఈ పథకం అమలుకు ఏడాదికి బడ్జెట్ అంచనా వ్యయం రూ.9 కోట్లు జియో ట్యాగ్ అయిన మగ్గాల నుంచి నిర్దిష్ట ఉత్పత్తి ప్రమాణాల ఆధారంగా చేనేత కార్మికులకు ఏడాదికి గరిష్టంగా రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6 వేలు వేతన సహాయం అందించబడుతుంది. దీంతో కార్మికులకు వేతన మద్దతు లభించడంతో పాటు నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. చేనేత మార్క్ లేబుల్చేనేత, సిల్క్ మార్క్ మాదిరే ప్రత్యేకమైన లోగో ద్వారా తెలంగాణకు ప్రత్యేకమైన చేనేత మార్క్ లేబుల్ రూపొందించబడింది. దీని లక్ష్యాలు ఏమంటే.. దేశ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రీమియానికి అనుగుణంగా తెలంగాణ చేనేత ఉత్పత్తులను లేబుల్ బ్రాండింగ్ చేయడం. చేనేత వస్త్రాల ఘన వారసత్వ, సంప్రదాయ ప్రతిష్టను పెంపొందించడం. చేనేత బ్రాండ్ ప్రచారంతో తెలంగాణ చేనేత ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు, సముచితమైన మార్కెట్‌ను సృష్టించడం. తెలంగాణ చేనేత కార్మికుల జీవనోపాధి, సంక్షేమం, అభివృద్దికి మద్దతుగా నిలవడం. పోటీ మార్కెట్‌ను తట్టుకునేలా తెలంగాణ చేనేత పరిశ్రమ సంప్రదాయ నైపుణ్యాలు, పని తనాన్ని సంరక్షించడం కొనసాగించడం ప్రధాన లక్ష్యం. ఇది కూడా చదవండి: Rythu Bharosa: వారికే రైతు భరోసా ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు! ఇక లేబుల్ ద్వారా తెలంగాణ చేనేత ఉత్పత్తులకు సమష్టి గుర్తింపును అందించడం. తెలంగాణలో చేతితో నేసిన ఉత్పత్తుల ద్వారా కార్మికుల గుర్తింపు ప్రచారమై కొనుగోలుదారులకు ప్రామాణికత, నాణ్యతపరమైన హామీ అందుతుంది. ఉత్పత్తి ప్రత్యేకతను పేర్కొనడం ద్వారా ఉద్వేగపూరితమైన, సృజనాత్మక హస్తకళల ముఖ్య లక్షణంగా ఉపయోగపడుతుంది. ఇది పోటీదారుల నుంచి వేరు చేసి వినియోగదారులతో అనుసంధానం చేస్తుంది. ఈ పథకం తెలంగాణ ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ డైరెక్టరేట్ ద్వారా అమలవుతుంది. ప్రచారంలో ఉంటుంది. ప్రత్యేకమైన లోగా ద్వారా 'తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్' రూపకల్పన చేయబడింది. ఇది కూడా చదవండి: Viruska: మరోసారి ఆ సాధువును కలిసిన విరుష్క జోడీ.. మళ్లీ అదే కారణమట! తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్‌కు ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. జియో ట్యాగ్‌తో అనుసంధానమైన మగ్గాలన్నీ వాటంతటవే రిజిష్టర్ అవుతాయి. ఇలా జియో ట్యాగ్ అయిన మగ్గాలన్నీ వాటంతటవే రిజిష్టర్ అయిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. కొత్త మగ్గాల విషయంలో తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్ నమోదుకు ఆన్‌సైట్ వెరిఫికేషన్ చేస్తారు. తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్ లేబుళ్లను ఆయా జిల్లాల అసిస్టెంట్ డైరెక్టర్లు (ఏడీ) సరఫరా చేస్తారు. తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్ లేబుళ్లకు వార్షిక బడ్జెట్ రూ.4 కోట్లు లేబుల్ ఒక వైపు తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్‌తో పాటు 9 అంకెల నంబర్ ఉంటుంది. అందులో మొదటి రెండు అంకెలు ఆ జిల్లా/ అసిస్టెంట్ డైరెక్టర్ కోడ్‌ను చెబుతాయి. తర్వాత రెండు అంకెలు సంవత్సరాన్ని తెలియజేస్తాయి. తర్వాత అయిదు అంకెలు రన్నింగ్ సీరియల్ నెంబర్ తెలియజేస్తాయి. లేబుల్ మరోవైపు కార్మికుడు, ఉత్పత్తి వివరాలు ఉంటాయి.