Telangana: తెలంగాణలో మరోచోట యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీ !

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. దుబ్బాకలో యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం వర్సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

New Update
CM Revanth

CM Revanth

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దుబ్బాకలో యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. దుబ్బాకలో వర్సిటీని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. స్థల పరిశీలనకు దుబ్బాక వెళ్లాళని సీఎంవో అధికారులను కూడా ఆదేశించారు. అలాగే హబ్లీపూర్‌ లచ్చపేట్ మధ్య డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సీఎంకు చెప్పారు.  

Also Read: మందు బాబుల గుండెలు పిండేసే వార్త.. ఏమిటో తెలిస్తే తట్టుకోలేరు!

 దీంతో సీఎం రేవంత్ డబుల్ రోడ్డు నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకోసం రూ.35 కోట్ల నిధులు వసూలు చేశారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM)లో ఆ రోడ్డును డెవలప్ చేస్తామని అధికారులు చెప్పారు. అలాగే తాము అడిగిన వెంటనే సానకూలంగా స్పందించినందకు సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. 

మరోవైపు తెలంగాణలో రహదారులను విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలను కలుపుతూ డబుల్ రోడ్లు నిర్మిస్తామని ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కొత్తగా డబుల్ రోడ్డు నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. 

Also Read: కాపాడండి ప్లీజ్ అంటూ కార్మికుల ఆర్తనాదాలు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియోలు

గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారును HAM విధానంలో నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఇటీవల అసెంబ్లీలో చెప్పారు. అయితే ఆ రహదారులకు ట్యాక్స్‌ వసూలు చేయమన్నారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం పన్నులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు వేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రహదారుల ద్వారానే అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.  

rtv-news | telugu-news | dubbaka | young-india-skill-university | cm revanth

 

Advertisment
Advertisment
Advertisment