/rtv/media/media_files/2025/02/12/APAKaHuvh56lxWiqTkFc.jpg)
chicken prices
Chicken Prices: పక్క రాష్ట్రల్లో బర్డ్ ప్లూ వైరస్ (Bird Flu Virus) కలకలం రేపుతోంది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ప్లూ వైరస్ గట్టిగానే ఉంది. తూర్పు గోదావరి జిల్లా కానూరులో కోళ్లకు బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో కలకలం చెలరేగింది. ఇప్పటి వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో 50 లక్షల కోళ్లు మృతి చెందినట్లు అంచనా. బర్డ్ ఫ్లూ భయం, అధికారుల హెచ్చరికలతో ఆయా జిల్లాల్లో చికెన్ రేటు దారుణంగా పడిపోయింది.
Also Read : Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!
వెలవెలబోతున్న చికెన్ సెంటర్లు
కోళ్లకు వైరస్ సోకుతుందనే అనే ప్రచారం బాగా జరగడంతో జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. అంతకుముందు కళకళలాడిన చికెన్ సెంటర్లు ఇప్పుడు ఖాళీగా వెలవెలబోతున్నాయి. ఆదివారం కేజీ రూ.200-220 ఉన్న ధర ఇప్పుడు రూ.150-170 పలుకుతోంది. రేటు తగ్గిన సరే జనాలు మాత్రం చికెన్ కొనడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇక తెలంగాణలో బర్డ్ ప్లూ వైరస్ ఎఫెక్ట్ పెద్దగా ఏమీ లేనప్పటికీ చికెన్ తినడానికి మాత్రం భయపడుతున్నారు.
దీంతో హైదరాబాద్‌లో 50 శాతానికి పడిపోయాయి చికెన్ అమ్మకాలు. కిలో చికెన్ ధర రూ.150కి పడిపోయింది. సాధారణంగా హైదరాబాద్‌లో రోజుకు 6 లక్షల కేజీల చికెన్ అమ్మకాలు జరిగేవి.. ఇప్పుడు ఇందులో సగం కూడా అమ్మకాలు జరగడం లేదు. ఇలా అయితే షాపులు మూసుకోవాల్సిందేనని చికెన్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఏపీలో బర్డ్‌ఫ్లూ వెలుగుచూడటంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఆ రాష్ట్రం నుంచి వస్తున్నకోళ్ల వాహనాలకు అనుమతి నిరాకరించింది. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 24చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి ఏపీ నుంచి వచ్చే కోళ్ల వాహనాలను తిరిగి పంపిస్తున్నారు. బర్డ్‌ఫ్లూ పై పౌల్ట్రీ రైతులకు అవగాహన కల్పించాలని పశుసంవర్ధక శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది.
Also read : అదిరిపోయిందిగా : ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం .. పెళ్లికి ముందు ఆ కౌన్సెలింగ్!