/rtv/media/media_files/2025/03/31/XMSQbMPSHP7Qr6rmptyo.jpg)
chicken-price ramdan
రంజాన్ పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో కిలో రూ.280 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు. కొన్నిచోట్ల డిమాండ్ ను బట్టి ఇంతకంటే ఎక్కువ ధరకే అమ్ముతున్నారు. దీంతో మాంసం దుకాణాల్లో పొద్దున నుంచే ఫుల్ రష్ ఉంది. కాగా బర్డ్ ఫ్లూ భయంతో గత వారం వరకు చికెన్ అమ్మకాలు పడిపోగా ధరలు తగ్గాయి. మళ్లీ నిన్న కేజీపై రూ.50 నుంచి రూ.70 పెరగ్గా, ఇవాళ ఆ ధరలూ మరింత ఎక్కువ అవడం గమనార్హం.
ఇక నిన్న మాంసం దుకాణాలపై ఉగాది పండుగ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. చికెన్, మటన్ దుకాణాల్లో కస్టమర్లు లేక వెలవెలబోయాయి. వాస్తవానికి ఆదివారం వచ్చిందంటే చాలు మాంసం ప్రియులు చికెన్, మటన్ షాపుల వద్దకు బారులు తీరుతారు. కానీ నిన్న ఆదివారం ఉగాది కావడంతో జనలంతా మాంసానికి దూరకంగా ఉన్నారు. ప్రజలందరూ ఆలయాల దర్శనాలు, పంచాంగ శ్రవణం చేశారు.