/rtv/media/media_files/2025/01/26/CrD5xVc2KE0mH4jjYdZp.jpg)
Chicken prices increased in Telangana Today Photograph: (Chicken prices increased in Telangana Today )
Chicken Price: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చికెన్ మార్కెట్ పై గట్టిగానే పడింది. బర్డ్ ఫ్లూ సోకి వేల సంఖ్యల్లో కోళ్లు మృతేవాత పడుతున్నాయి. దీంతో జనాలు చికెన్ తినాలంటేనే భయపడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. కస్టమర్లు కన్నెత్తిచూడకపోవడంతో చికెన్ షాపులు బోసిపోతున్నాయి. మొన్నటివరకు లైవ్‌కోడి కిలోధర రూ.180 ఉండగా.. ఇప్పుడు కాస్త రూ.90కి పడిపోయింది.
Also Read: Rishab Shetty: ఫ్యాన్స్ కి గూస్ బంప్స్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి.. పోస్టర్ వైరల్
పెరిగిన చికెన్ ధరలు
ఈ క్రమంలో చికెన్ ధరలకు మళ్ళీ రెక్కలొచ్చాయి. తాజాగా పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా. దామోదర హైదరాబాద్ లో బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులో ఉన్నట్లు వెల్లడించడంతో చికెన్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంది. బర్డ్ ఫ్లూ కోళ్ల నుంచి మనుషులకు సోకిన కేసులు ఎక్కడా నమోదు కాలేదని. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. దీంతో KG రూ. 140కి పడిపోయిన ధరలకు మళ్లీ పెరిగాయి. గురువారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. KG స్కిన్లెస్ రూ. 200, విత్ స్కిన్ రూ. 180గా ధరలు నిర్ణయించారు. అయితే ఉడికించిన చికెన్ తింటే ఎలాంటి ప్రమాదం లేదని వెటర్నరీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంత వేడిలో వైరస్ బతకదని అంటున్నారు.
Also Read: Urvashi Rautel: ఊర్వశీకి ఘోర అవమానం.. సోషల్ మీడియాలో నెట్ ఫ్లిక్స్ పై భారీ ట్రోలింగ్!
అయితే చనిపోయిన కోళ్లల్లో ఎలాంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడం లేదన్నారు. కొక్కెర రోగం సోకినట్టు అనుమానిస్తున్నట్టుగా వెల్లడించారు. ఐదు కోళ్లను హైదరాబాద్ ల్యాబుకు మరో మూడు కోళ్లను మహబూబ్ నగర్ ల్యాబు పంపినట్టుగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వీపరితంగా ఉండడంతో కోళ్ల షెడ్లను ఖాళీగా ఉంచుకోవాలని రైతులకు సూచించారు.
Also Read: Lavanya: ఓవైపు రాజ్ ని ప్రేమిస్తూనే మస్తాన్ సాయితో బెడ్ రూమ్ లో.. లావణ్య గురించి ఫ్రెండ్ ప్రీతీ..