/rtv/media/media_files/2025/03/28/Rtquq5S7gpXDwvjyfLpC.jpg)
Palamuru Ethipotala Project
Palamuru Project: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని గతంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. కృష్ణానదీ జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం కోర్టులో ఉందని తెలిపింది. అందుకే జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను తిరిగి పంపించనట్లు కేంద్రం లోక్‌సభలో చెప్పింది. 2024 డిసెంబర్‌లోనే ఈ ప్రక్రియ చేపట్టామని పేర్కొంది. ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి సభలో అడిగిన ప్రశ్నకు జల్‌శక్తి శాఖ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.
Also Read: కుణాల్ కామ్రాకు హైకోర్టులో ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు
Also Read: కాపాడండి ప్లీజ్ అంటూ కార్మికుల ఆర్తనాదాలు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియోలు
ఇదిలాఉండగా..
రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డబుల్ బెడ్‌రూం ఇళ్లపై కీలక ప్రకటన చేశారు. ఇంటిస్థలం లేని అర్హులకు ఇళ్లు కేటాయించాలి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే అంసపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఒకవేళ కాంట్రాక్టర్లు ముందుకు రానట్లయితే లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా ఆర్థికసాయం చేస్తామని తెలిపారు. ఇక పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని తెలిపారు. బేస్‌మెంట్ పూర్తి చేసిన లబ్ధిదారులకు మొదటి విడుతలో రూ.లక్ష చెల్లించాలని అధికారులను ఆదేశించారు.
Also Read: నేపాల్‌లో మరోసారి ఘర్షణలు..హిందూ దేశం, రాచరిక పాలన కావాలని డిమాండ్
Also Read: కాపాడండి ప్లీజ్ అంటూ కార్మికుల ఆర్తనాదాలు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియోలు
telugu-news | rtv-news | central-govt | telangana