/rtv/media/media_files/2026/03/29/fotojet-11-2026-03-29-08-02-54.jpg)
NALSAR University
NALSAR University : జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నల్సాల్ న్యాయ విశ్వవిద్యాలయం డ్రగ్స్ కేంద్రంగా మారినట్లు పోలీసులు గుర్తించారు. విశ్వావిద్యాయలంలోని పలువురు విద్యార్థులు డగ్స్‌కు అలవాటు పడినట్లు నిర్ధారించారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పరిధిలో దాదాపు 30ఏళ్ల క్రితం నల్సార్ విశ్వవిద్యాలయం నిర్మితమైంది. నాటి నుంచి ఎంతో క్రమశిక్షణ కలిగిన యూనివర్సిటీగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. అలాంటి యూనివర్సిటీలో రెండు సంవత్సరాలుగా కొంతమంది విద్యా్ర్థులు డ్రగ్స్‌కు బానిసలుగా మారినట్లు తెలుస్తోంది.
యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి డ్రగ్స్‌కు బానిసై మూడు నెలల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. యూనివర్సిటీలో చదువుతున్న పలువురు విద్యార్థులు రోజు రాత్రి 10 దాటితే చాలు వర్సిటీ నుంచి బయటకు వెళ్తున్నారని తెలిసింది. అలా వెళ్లిన వారు పబ్‌లు, ఇతర ప్రాంతాల్లో మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం చేస్తున్నారని తేలింది. గత నెల 21న కూడా రాత్రి సమయంలో యూనివర్సిటీకి చెందిన పలువురు విద్యార్థులు బయటకు వెళ్లారు. వారిలో విద్యార్థులు ప్రియాన్ష్ కుమార్ మీనా, సాక్షం, గోపిచంద్ బయటకు వెళ్లి గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలు సేవించినట్లు తెలుస్తోంది. రాత్రి 11గంటల సమయంలో బైక్‌పై ముగ్గురు విద్యార్థులు తిరిగి వర్సిటీకి వస్తుండగా పెద్దమ్మ కాలనీ వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థుల్లో సాక్షం దుర్మరణం చెందాడు. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ప్రమాద ఘటనపై వర్సిటీ ప్రొఫెసర్ మల్లికార్జున్ శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు గంజాయి సేవించినట్లు ఈగల్ టీమ్ అధికారులు గుర్తించారు. రోడ్డు ప్రమాదం జరిగిన రోజు విద్యార్థులు ద్రిషక్‌రాజ్, నిధాన్, దేశ్ పాండే, గోపిచంద్, ప్రియాన్ష్ కుమార్, సాక్షం తదితరులు కలిసి రెండు బైక్‌లపై వర్సిటీ నుంచి బయటకు వెళ్లినట్లు రుజువైంది. ఈగల్ టీమ్ అధికారులు ఆ విద్యార్థులను ఈనెల 24న శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. విద్యార్థులందరికీ డ్రగ్స్ టెస్టు చేయగా ద్రిషక్‌రాజ్‌కు పాజిటివ్ వచ్చింది. అయితే ఈ సందర్భంగా పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. ద్రిషక్‌రాజ్ 2024 నుంచి కూడా గంజాయి సేవిస్తున్నట్లు తేలింది. వర్సిటీకి చెందిన విద్యార్థి రుషి వద్ద గంజాయిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. అతని మిత్రులు అభిషేక్, ఆర్యన్, ప్రభు కూడా గంజాయి సేవిస్తున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. తాజా ఘటనలో పోలీసులు నలుగురు విద్యార్థులపై కేసు నమోదు చేశారు.
Follow Us