Cabinet expansion : రాష్ట్రంలో కొత్తమంత్రులు..కొత్త పదవులు..ఎవరెవరికో తెలుసా?

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఉత్కంఠ రేపుతున్న మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. మంత్రివర్గ విస్తరణతో పాటు ముఖ్య పదవుల భర్తీకి ఏఐసీసీ తుది రూపం ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. సామాజిక అంశాలు.. సీనియారిటీ ప్రాతిపదికన ఈ లిస్టు సిద్దమైంది.

New Update
Cabinet expansion

Cabinet expansion

Cabinet expansion :  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఉత్కంఠ రేపుతున్న మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. మంత్రివర్గ విస్తరణతో పాటుగా ముఖ్య పదవుల భర్తీ పైన ఏఐసీసీ జాబితా కు రూపం ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. సామాజిక అంశాలు.. సీనియారిటీ ప్రాతిపదికన ఈ లిస్టు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కస్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో పార్టీలో మార్పులు చేర్పులు తప్పనిసరి అని అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెల్లనున్నారు. రేవంత్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది.

Also Read: షామా కేక్‌పై మళ్లీ రచ్చ.. టేస్ట్ చూడాలంటే రోహిత్ కంటే ఫిట్‌గా ఉండాలట!

మరోవైపు ఈ మధ్నాహ్నం సీఎం రేవంత్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి ఇంటికి వెళ్లటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనకు ప్రభుత్వంలో కీలకపదవి ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోంది. ఆయనను ప్రభుత్వ సలహదారుగా నియమిస్తారని తెలుస్తోంది. ఇక అదే సమయంలో తెలంగాణలో కేబినెట్ విస్తరణ.. పదవుల ఖరారు పైన కీలక చర్చలు జరుగుతున్నాయి. పార్టీ తో పాటు  ప్రభుత్వంలో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల భర్తీతో పాటుగా డిప్యూటీ స్పీకర్ పదవి పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చీఫ్ విప్.. కార్పోరేషన్ ఛైర్మన్ల పదవులు భర్తీ చేయనున్నారు. అందులో భాగంగా డిప్యూటీ స్పీకర్ పదవి లంబాడా వర్గానికి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు ఉప సభాపతి పదవి దక్కటం దాదాపు ఖాయమైంది. 

Also Read: పోసానికి ఏపీ హైకోర్టులో నిరాశ..క్వాష్ పిటిషన్‌ కొట్టివేసిన ఏపీ హైకోర్టు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన రెడ్డి వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యేను చీఫ్ విప్ చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం.ఇక మైనార్టీ వర్గానికి ఒక మంత్రి పదవి దక్కనుంది. ఇందు కోసం గ్రేటర్ పరిధిలోని నాయకుడిని గుర్తించినట్లు ప్రచారం సాగుతోంది. నల్గొండ నుంచి మరొకరికి మంత్రిగా ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే, ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటంతో చివరి నిమిషంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి కరీం నగర్ జిల్లా నుంచి మరొకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆ సీనియర్ నేతను కేబినెట్ లో తీసుకుంటారని సమాచారం.  

ఇది కూడా చూడండి: Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!

 ఇద్దరు బీసీలను కేబినెట్ లోకి తీసుకోవాలని ఏఐసీసీ సూచిస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒకరికి ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ నుంచి గతంలో మంత్రిగా పని చేసిన సీనియర్ నేతకు తిరిగి బెర్తు ఖాయమైనట్లు సమాచారం. ఇక, ఉమ్మడి అదిలాబాద్ నుంచి దళిత ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కనుంది. ఇద్దరు బీసీలతో పాటుగా ఇద్దరు రెడ్డి, ఒక మైనార్టీ, ఒక దళిత వర్గాలకు కొత్తగా కేబినెట్ లో అవకాశం దక్కనుంది. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలోనూ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న సీనియర్ నేతతో పాటు మరో ఇద్దరికీ ఎమ్మె్ల్సీలు దక్కనున్నాయి. అవి ఎవరికివ్వాలి అనే అంశం పై చర్చిస్తున్నారు.అదే విధంగా నామినేటెడ్ పోస్టుల్లోనూ సామాజిక లెక్కల ఆధారంగా నిర్ణయం చేయనున్నారు. సీఎం రేవంత్ పర్యటనలో ఈ సారి ఏఐసీసీ అన్ని అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

Also read: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదంలో మరో స్పెషల్ ఐటెమ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Thatikonda vs Kadiyam : కడియం టాల్ లీడర్ కాదు, ఫాల్ లీడర్...మాజీ మంత్రి రాజయ్య సంచలనవ్యాఖ్యలు

స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబంపై కడియం చేసిన ఆరోపణలకు తాటికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు.

New Update
 Thatikonda Rajaiah vs kadiyam srihari

Thatikonda Rajaiah vs kadiyam srihari

 Thatikonda vs Kadiyam : స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ఆరోపణలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు. ఆయ‌న మీడియాతో మాట్లడుతూ.. కడియం శ్రీహరీ నీది నాలికా తాటి మట్టా..? తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నీచ సంస్కృతి నీది.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మీద వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. నువ్వు అన్నం తింటున్నవా..గడ్డి తింటున్నావా.. పదేళ్లు ఆ కుటుంబంలో అంతరంగికుడిగా ఉన్నావ్ కదా.. కాంగ్రెస్ పార్టీలో చచ్చిన పాములా పడి ఉన్నావ్.. ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలి.. లేకపోతే నిన్ను బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీద తిరగనివ్వరు అని హెచ్చరించారు. న‌మ్మక‌ద్రోహానికి ప్రతిరూపం నువ్వు.. నీ ప్రవర్తన.. నీ ద్రోహాన్ని చూసి కాంగ్రెస్ వాళ్లు కూడా ఉమ్మేస్తున్నారు.1994 కు ముందు నీ ఆస్తులు ఎంత..? ఇప్పుడు ఎంత..? అని ప్రశ్నించారు. 30 ఏళ్లలో ఎలా కుబేరుడు అయ్యావు.. నీ ఇళ్ళు, దేవునూరు భూములు, పెట్రోల్ బంకులే నీ అవినీతికి సాక్ష్యం అన్నారు.. విదేశాలలో నీ ఆస్తులే సాక్ష్యం..ఇంకొకసారి నీతి, నిజాయితీ గురించి మాట్లాడవద్దు అని మండిప‌డ్డారు.

Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

ఇంకా ఆయన మాట్లాడుతూ, “చనిపోయిన పాము కొస తోకకు ప్రాణం ఉన్నట్టు కడియం రాజకీయం ఉండేది ” అంటూ ఘాటుగా స్పందించారు. కడియం శ్రీహరికి రాజకీయ జన్మ ఇవ్వడంలో ముందుగా కేసీఆర్ పాత్ర ఉందని, రెండోసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతోనే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ లభించిందని రాజయ్య పేర్కొన్నారు.అలాగే, స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పాత్రను ప్రస్తావిస్తూ, “వేడినీళ్లకు చన్నీళ్ల లాగా రాజేశ్వర్ రెడ్డి వ్యవహరించారు. అభివృద్ధి విషయాల్లో ఆయన పాత్ర ఘణనీయమైంది” అని అన్నారు. కేసీఆర్ మాటల్లో ఎప్పుడూ కడియం పేరు రాలేదని, అయినప్పటికీ ఆయన తన స్థాయిని మరిచి ప్రెస్ మీట్‌లో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఇక కడియం శ్రీహరి పాలన గురించి మాట్లాడుతూ, “ఇప్పుడిది ప్రజాస్వామ్యం కాదు, అక్రమ అరెస్టులతో ఒక వర్గానికి అనుకూలంగా పాలన సాగుతోంది. ప్రజల స్వేచ్ఛలు హరించబడుతున్నాయి” అని ఆరోపించారు.అంతేకాకుండా… “రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘన్‌పూర్ ప్రజలకు జీవితాంతం గులామ్‌గిరి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది” అంటూ రాజయ్య హెచ్చరించారు. ఆయన కడియంపై ఆస్తుల విషయమై కూడా ఆరోపణలు చేశారు. “దేవనూరు పరిసర ప్రాంతాల్లో బినామీ పేర్లతో భూములు ఉన్నాయా? కుటుంబంతో కలిసి పాలేరు ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నావా?” అంటూ ప్రశ్నలు సంధించారు.మొత్తం 23 మంది రైతులకు చెందిన 43 ఎకరాల 38 గుంటల భూమిని బినామీ పేర్లతో స్వాధీనం చేసుకున్నారని పేర్కొంటూ, “ఇది వాస్తవం కాదా?” అంటూ రాజయ్య నిలదీశారు. చివరగా, “నీవు టాల్ లీడర్ (ఎత్తైన నాయకుడు) కాదు, ఫాల్ లీడర్ (పడిపోయే నాయకుడు)” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

Also read :  Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!

Advertisment
Advertisment
Advertisment