KCR: ఆ పదిస్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేసీఆర్ సంచలన కామెంట్స్

చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈరోజు తెలంగాణ భవన్‌లో విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల్లో జోష్‌ నింపే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట్ల ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు.

New Update
KCR

KCR

KCR: చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈరోజు తెలంగాణ భవన్‌లో విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల్లో జోష్‌ నింపే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట్ల ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు. ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండాలని క్యాడర్ కు సూచించారు కేసీఆర్. ఉప ఎన్నికల్లో గెలుపు తమదేనని గులాబీ బాస్ ధీమా వ్యక్తం చేశారు. 100 శాతం మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు.ఒక్క ఓటమితో కొట్టుకుపోయే పార్టీ బీఆర్ఎస్ కాదన్నారు. ఇటు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, గ్రాఫ్ వేగంగా పడిపోతోందని, కాంగ్రెస్ ఇక కోలుకోలేదన్నారు కేసీఆర్.  

ఇది కూడా చదవండి: Eatala Rajender: రేవంత్ పై కాషాయ బుక్.. ఈటల సంచలన ప్రకటన!

మరోవైపు బీఆర్ఎస్ నేతలపై గులాబీ బాస్ కేసీఆర్ సీరియస్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలే పార్టీ పనైపోయిందని ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. అలాంటి ప్రచారంతోనే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంలోకి వెళ్లి పార్టీ మారారని అన్నారు. ఇప్పటికైనా అలాంటి ప్రచారాలను ఆపాలని, తిప్పి కొట్టాలని నేతలకు సూచించారు. అలాంటి ప్రచారంతోనే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంలోకి వెళ్లి పార్టీ మారారని అన్నారు. ఇప్పటికైనా అలాంటి ప్రచారాలను ఆపాలని, తిప్పి కొట్టాలని నేతలకు సూచించారు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదని స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం అంతా కష్టపడాలని సూచించారు. 

Also Read:  మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు!
 
రాష్ట్రంలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కేసీఆర్‌ అన్నారు. పార్టీ ఫిరాయించిన 10 ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయమన్న గులాబి బాస్‌, ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు తీర్పు రాబోతోందని ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఈ అంశం గురించి ఇప్పటికే లాయర్లతో మాట్లాడినట్లు తెలిపారు. తెలంగాణ కోసం ఒక్క బీఆర్‌ఎస్‌ మాత్రమే పోరాడగలదని, పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కిపోతోందన్నారు. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలి అంటూ దిశా నిర్ధేశం చేశారు.  


 Also Read: chhaava: అదిరిపోయింది గురూ.. చావా సినిమా చూడటానికి ఏకంగా గుర్రంపై వచ్చి.. వీడియో వైరల్

ఏప్రిల్‌ 27వ తేదీన భారీ బహిరంగ సభ..

ఏప్రిల్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ సిల్వర్‌ జూబ్లీ వేడుకలు ఉంటాయన్న కేసీఆర్‌ వీటిని ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 10 నుంచి 27వ తేదీ దాకా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతీ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఇక ఏప్రిల్‌ 27వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం పార్టీ సంస్థాగత కమిటీలను వేయనున్నట్లు తెలిపారు. ఆ కమిటీలకు ఇంఛార్జిగా హరీష్‌ రావుకు బాధ్యతలు అప్పగించారు. 
 
Also Read:  ఏపీలో వీసీల నియామకం.. యూనివర్సిటీల వారీగా లిస్ట్ ఇదే!


ఇదిలా ఉంటే కేసీఆర్‌ అమెరికా వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అమెరికాలో చదువుకుంటున్న మనువడు హిమాన్షుతో కొంతకాలం గడిపేందుకు ఆయన వెళ్లనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే బుధవారం ఉదయం ఎర్రవల్లి ఫామ్‌ హౌజ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కేసీఆర్‌ తొలుత సికింద్రాబాద్ పాసపోర్ట్‌ కార్యాలయానికి వెళ్లడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది. అక్కడ డిప్లోమేటిక్‌ పాస్‌పోర్టును అప్పగించి.. సాధారణ పాస్‌పోర్టును రెన్యువల్‌ చేసుకున్నారు. అయితే కేసీఆర్‌ అమెరికా పర్యటనపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. 

Also Read:  భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!

Advertisment
Advertisment
Advertisment