/rtv/media/media_files/2026/02/16/brs-working-president-ktr-appoints-special-incharges-for-hung-muncipalities-2026-02-16-19-37-29.jpg)
BRS Working president KTR Appoints Special incharges for hung muncipalities
హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎనిమిది పట్టణాలకు సీనియర్ నేతలను ఇన్‌ఛార్జులుగా నియమించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో మాట్లాడారు. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. స్థానికంగా కాంగ్రెస్ చేస్తున్న అక్రమ కిడ్నాప్‌లు, బెదిరింపులు వంటి అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకునేందుకు స్థానిక నాయకత్వానికి తాము అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు పార్టీ తరఫున సీనియర్ నాయకులను ప్రత్యేక ఇన్‌ఛార్జులుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
Also read: డ్రైవర్ నుంచి మేయర్ దాకా.. కొత్తగూడెం మేయర్‌గా సీపీఐ నేత మూడ్ గణేశ్
ప్రత్యేక ఇన్‌ఛార్జుల జాబితా
తొర్రూర్: ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
జనగామ: శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మరియు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
క్యాతనపల్లి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఖానాపూర్: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఇంద్రేశం: ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కాగజ్ నగర్: మాజీ మంత్రి జోగు రామన్న
జహీరాబాద్: ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ మరియు సునీతా లక్ష్మారెడ్డి
ఇబ్రహీంపట్నం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మరియు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
Follow Us