Kavita: కవిత కొత్త పార్టీపై బీఆర్‌ఎస్‌ ట్రోలింగ్.. 'ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే' అంటూ సెటైర్లు

జాగృతి అధ్యక్షురాలు కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ తన అధికారిక ఎక్స్‌లో కవితను విమర్శిస్తూ ఓ సెటైరికల్ పోస్టు చేసింది.

New Update
BRS Satires on Kavita new party

BRS Satires on Kavita new party

తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. జాగృతి అధ్యక్షురాలు కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ తన అధికారిక ఎక్స్‌లో కవితను విమర్శిస్తూ ఓ సెటైరికల్ పోస్టు చేసింది. కోల్‌గేట్ టూత్‌పేస్టు, బిస్లేరీ బాటిల్‌కి సంబంధించి ఒరిజినల్, ఫేక్ ఫొటోలు జోడించింది. ''ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే!'' అనే క్యాప్షన్ ఇచ్చింది. దీనిబట్టి కవిత.. తన పార్టీ పేరును టీఆర్‌ఎస్‌గా పెట్టుకున్నప్పటికీ అసలైన టీఆర్‌ఎస్‌కే ప్రాధాన్యత ఉంటుందని ఈ పోస్టు స్పష్టం చేస్తోంది. 

Also Read: రోడ్డెక్కిన బస్సులు.. ఆర్టీసీ ఉద్యోగులకు భారీగా పీఆర్సీ పెంపు..

 మరోవైపు కొత్త పార్టీ ప్రకటించిన సందర్భంగా కవిత మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు చేశారు. ఆయన మారిన మరమనిషి అంటూ మండిపడ్డారు. మన కేసీఆర్‌ అయ్యింటే పాలమూరు ప్రాజెక్టు కట్టేవారని.. ఆయన రాజకీయ పరిణితి కోల్పోయారంటూ మండిపడ్డారు. ఇళ్లను కూలుస్తుంటే ఆదుకోవాల్సిన కేసీఆర్‌ ఎక్కడున్నారని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందన్నారు. సామాజిక తెలంగాణ రథచక్రం ముక్కలయ్యిందని వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో కర్కోకటుడి పాలన నడుస్తోందన్నారు. గురుకులాల్లో చిన్నారులు చనిపోతున్నా సీఎం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మూడు పార్టీలు అధర్మం, అవినీతి, బంధుప్రీతిలో నిండిపోయాయంటూ ధ్వజమెత్తారు.

Advertisment
తాజా కథనాలు