/rtv/media/media_files/2025/02/19/J6pbqRBJFdKyg6jHvGx7.jpg)
KCR Public Meeting
100 శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసం పార్టీ నేతలు పని చేయాలని సూచించారు. ఏప్రిల్ 10 నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రతీ జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: VIRAL VIDEO: ఒర్లకండిరా బాబు.. దండం పెడతా.. కార్యకర్తలపై కేసీఆర్ సీరియస్!
మహిళలకు 53 సీట్లు..
పార్టీ నాయకులకు త్వరలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. పార్టీలో సమూల మార్పులు ఉంటాయని ప్రకటించారు. డీలిమిటేషన్ తో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 160కి చేరుతాయన్నారు. ఇందులో మహిళలకు 53 సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. త్వరలో మహిళా అధ్యక్ష్యురాలిని నియమించనున్నట్లు చెప్పారు. తెలంగాణ జాగృతి వాళ్లు ఏం చేయాలో అది చేస్తారన్నారు. బీఆర్ఎస్ ది సెక్యూలర్ సిద్ధాంతమని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Eatala Rajender: రేవంత్ పై కాషాయ బుక్.. ఈటల సంచలన ప్రకటన!
ఏడాది పాటు పోరాటాలు..
ఒక్క సంవత్సరం పాటు ఉధృతంగా ఉద్యమాలు చేయనున్నట్లు చెప్పారు. నెలకు ఒక్క అంశం పై పోరాటం ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రతీ జిల్లాలో మూడు కమిటీలు వేయనున్నట్లు చెప్పారు. రైతులు, కార్మికులు,మహిళలు, విద్యార్థుల పక్షాన పోరాటం చేయనున్నట్లు చెప్పారు. కమ్యూనిస్టు పార్టీలు అధికార పార్టీతో అంటకాగుతున్నాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని.. భవిష్యత్తు బీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్.