/rtv/media/media_files/2025/04/09/gNCHI5UFajZCaUFz2ytf.jpg)
Thatikonda Rajaiah vs kadiyam srihari
Thatikonda vs Kadiyam : స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ఆరోపణలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లడుతూ.. కడియం శ్రీహరీ నీది నాలికా తాటి మట్టా..? తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నీచ సంస్కృతి నీది.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మీద వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. నువ్వు అన్నం తింటున్నవా..గడ్డి తింటున్నావా.. పదేళ్లు ఆ కుటుంబంలో అంతరంగికుడిగా ఉన్నావ్ కదా.. కాంగ్రెస్ పార్టీలో చచ్చిన పాములా పడి ఉన్నావ్.. ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలి.. లేకపోతే నిన్ను బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీద తిరగనివ్వరు అని హెచ్చరించారు. నమ్మకద్రోహానికి ప్రతిరూపం నువ్వు.. నీ ప్రవర్తన.. నీ ద్రోహాన్ని చూసి కాంగ్రెస్ వాళ్లు కూడా ఉమ్మేస్తున్నారు.1994 కు ముందు నీ ఆస్తులు ఎంత..? ఇప్పుడు ఎంత..? అని ప్రశ్నించారు. 30 ఏళ్లలో ఎలా కుబేరుడు అయ్యావు.. నీ ఇళ్ళు, దేవునూరు భూములు, పెట్రోల్ బంకులే నీ అవినీతికి సాక్ష్యం అన్నారు.. విదేశాలలో నీ ఆస్తులే సాక్ష్యం..ఇంకొకసారి నీతి, నిజాయితీ గురించి మాట్లాడవద్దు అని మండిపడ్డారు.
Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!
ఇంకా ఆయన మాట్లాడుతూ, “చనిపోయిన పాము కొస తోకకు ప్రాణం ఉన్నట్టు కడియం రాజకీయం ఉండేది ” అంటూ ఘాటుగా స్పందించారు. కడియం శ్రీహరికి రాజకీయ జన్మ ఇవ్వడంలో ముందుగా కేసీఆర్ పాత్ర ఉందని, రెండోసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతోనే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ లభించిందని రాజయ్య పేర్కొన్నారు.అలాగే, స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పాత్రను ప్రస్తావిస్తూ, “వేడినీళ్లకు చన్నీళ్ల లాగా రాజేశ్వర్ రెడ్డి వ్యవహరించారు. అభివృద్ధి విషయాల్లో ఆయన పాత్ర ఘణనీయమైంది” అని అన్నారు. కేసీఆర్ మాటల్లో ఎప్పుడూ కడియం పేరు రాలేదని, అయినప్పటికీ ఆయన తన స్థాయిని మరిచి ప్రెస్ మీట్‌లో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి
ఇక కడియం శ్రీహరి పాలన గురించి మాట్లాడుతూ, “ఇప్పుడిది ప్రజాస్వామ్యం కాదు, అక్రమ అరెస్టులతో ఒక వర్గానికి అనుకూలంగా పాలన సాగుతోంది. ప్రజల స్వేచ్ఛలు హరించబడుతున్నాయి” అని ఆరోపించారు.అంతేకాకుండా… “రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘన్‌పూర్ ప్రజలకు జీవితాంతం గులామ్‌గిరి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది” అంటూ రాజయ్య హెచ్చరించారు. ఆయన కడియంపై ఆస్తుల విషయమై కూడా ఆరోపణలు చేశారు. “దేవనూరు పరిసర ప్రాంతాల్లో బినామీ పేర్లతో భూములు ఉన్నాయా? కుటుంబంతో కలిసి పాలేరు ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నావా?” అంటూ ప్రశ్నలు సంధించారు.మొత్తం 23 మంది రైతులకు చెందిన 43 ఎకరాల 38 గుంటల భూమిని బినామీ పేర్లతో స్వాధీనం చేసుకున్నారని పేర్కొంటూ, “ఇది వాస్తవం కాదా?” అంటూ రాజయ్య నిలదీశారు. చివరగా, “నీవు టాల్ లీడర్ (ఎత్తైన నాయకుడు) కాదు, ఫాల్ లీడర్ (పడిపోయే నాయకుడు)” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Also Read: అమెరికా ఆహారం బంద్..11 దేశాలకు కష్టం!
Also read : Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!
kavitha : రేవంత్ సీఎం కావడం తెలంగాణ ఖర్మ.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
సీఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌లా మాట్లాడి తన స్థాయి తగ్గించుకోలేనని అన్నారు. సుప్రీం కోర్టు చెప్పినా రేవంత్ రెడ్డి తీరు మారలేదన్న కవిత.. సుప్రీంకోర్టుతో తిట్లు తిన్న మొదటి సీఎం రేవంత్ కావడం తెలంగాణ ఖర్మ అని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌లా మాట్లాడి తన స్థాయి తగ్గించుకోలేనని అన్నారు. సుప్రీం కోర్టు చెప్పినా రేవంత్ రెడ్డి తీరు మారలేదన్న కవిత.. సుప్రీంకోర్టుతో తిట్లు తిన్న మొదటి సీఎం రేవంత్ కావడం తెలంగాణ ఖర్మ అని చెప్పారు. సీఎం విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని కవిత మండిపడ్దారు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి సీఎంగా ఉండటం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టమంటూ సంచలన కామెంట్స్ చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం పట్టణంలోని పసుపు మార్కెట్ యార్డును కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఈ కామెంట్స్ చేశారు.
Also Read : సీఎం రేవంత్ తో కోనేరు కోనప్ప భేటీ.. ఆ హామీ ఇస్తేనే పార్టీలో ఉంటానని కండీషన్?
నామమాత్రంగా పసుపు బోర్డు
పసుపు బోర్డు ఏర్పాటుపై కవిత మాట్లాడుతూ.. పసుపు బోర్డును ఏదో నామమాత్రంగా ఏర్పాటు చేశారని ఆరోపించారు. పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయిస్తే రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. రోజురోజుకూ పసుపు ధర పతనం అవుతోందన్న కవిత...రూ.15వేల మద్దతు ధర ఇస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని విమర్శించారు. వ్యాపారులు సిండికేట్ అయి పసుపు రైతులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వానికి మార్చి 1వతేదీ వరకు డెడ్ లైన్ విధిస్తున్నామని.. సుపు క్వింటాలుకు పదిహేను వేల ధర ఇవ్వకుంటే రైతులతో కలిసి కలెక్టరేటును ముట్టడిస్తామని హెచ్చరించారు.
చంద్రబాబుపైనే ఎక్కువ ప్రేమ
బనకచర్ల నుంచి మన నీటిని ఏపీ ఎత్తుకుపోతుంటే రేవంత్ రెడ్డి చూస్తూ నిలబడ్డారంటూ కవిత మండిపడ్డారు. తెలంగాణపై ప్రేమ ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ కంటే చంద్రబాబుపైనే ఎక్కువ ప్రేమ ఉందని విమర్శించారు. రైతుల ఉసురు తీసి గోదావరి, కృష్ణా జలాలను ఇచ్చి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అని కవిత నిలదీశారు.
Also read : కొత్త ప్రేయసితో శిఖర్ ధావన్.. ఆమె ఎవరో తెలుసా?
Thatikonda vs Kadiyam : కడియం టాల్ లీడర్ కాదు, ఫాల్ లీడర్...మాజీ మంత్రి రాజయ్య సంచలనవ్యాఖ్యలు
స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమ... Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ
KTR : హనుమాన్ పూజలో పాల్గొని.. స్వాములతో కలిసి భోజనం చేసిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. హనుమాన్ దీక్షా స్వాము....Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
Basara Triple IT : బాసర త్రిపుల్ ఐటీలో కాంట్రాక్ట్ అధ్యాపకుల సంచలన నిర్ణయం.. మూకుమ్మడి రాజీనామా
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాసరలోని త్రిపుల్ ఐటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | తెలంగాణ
Maoist: మవోయిస్టులకు ఆర్ఎస్ ప్రవీణ్ మద్దతు.. దేశ పౌరులను చంపడం అత్యంత నేరం అంటూ!
చర్చలకు సిద్ధమంటూ ప్రకటించిన మావోయిస్టు పార్టీ లేఖపై ఆర్ఎస్ ప్రవీణ్. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | నేషనల్ | తెలంగాణ
Mohan Babu Court Case : ఎల్బీనగర్ కోర్టులో మోహన్ బాబుకు షాక్
సినీ నటుడు మంచు మోహన్ బాబుకు ఎల్బీనగర్ కోర్టులో చుక్కెదురైంది. జల్పల్లిలోని ఇంటి వివాదంపై గతంలో మోహన్ బాబు...Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి
ఇండియా నుంచి బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టినట్లే బీజేపీని ఓడించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ
Viral news: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి
Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...
Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!
Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో
Marriage: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్..