Kavitha Vs Revanth: తెలంగాణలో మూడు హత్యలు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు!
మూడు అనుమానాస్పద హత్యలు జరిగాయంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు MLC కవిత కౌంటర్ ఇచ్చారు. న్యాయవాది సంజీవ రెడ్డి కోర్టులో గుండె పోటుతో మరణించారన్నారు. భూతగాదాలతోనే రాజలింగమూర్తి హత్య జరిగిందన్నారు. దుబాయ్ లో ఒక వ్యక్తి నిద్రలోనే చనిపోయారని పత్రికల్లో వచ్చిందన్నారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణకు రక్షణకవచంగా ఉన్న బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తెలంగాణలో మూడు అనుమానాస్పద హత్యలు జరిగాయంటూ నిన్న సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. న్యాయవాది సంజీవ రెడ్డి కోర్టులో వాదిస్తూ అందరి ముందే ఆరు నెలల క్రితమే గుండె పోటుతో మరణించారన్నారు. భూపాలపల్లిలో భూతగాదాల వల్లనే రాజలింగమూర్తి హత్య జరిగినట్లు జిల్లా ఎస్పీ చెప్పారన్నారు. దుబాయ్ లో ఒక వ్యక్తి నిద్రలోనే చనిపోయారని పత్రికల్లోనే వచ్చిందన్నారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి అంతులేని అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ డైరెక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు.
కల్వకుంట్ల కుటుంబం అంటేనే కట్టుబాట్లు..
ప్రతీ విషయంలో బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారన్నారు. అహంకారానికి, కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్ ఎనుముల రేవంత్ రెడ్డి అని అన్నారు. బీజేపీ నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారన్నారు. మేము వాస్తవాలు బయటపెట్టగానే బీజేపీ నాయకులు మమ్మల్నే విమర్శిస్తారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉందన్నారు. ప్రధానిని కలిసిన తర్వాత కేసీఆర్, కేటీఆర్ పై కేసులు పెడుతామని రేవంత్ రెడ్డి అంటున్నారన్నారు. లేనిపోని విషయాలు తెచ్చి మాకు అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్పా సీఎంకు ఇంకో ఆలోచన లేదని ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో కూడిన కుటుంబమన్నారు.
బీజేపీ - కాంగ్రెస్ మధ్య దోస్తీ బట్టబయలైంది.
రేవంత్ రెడ్డి నిన్న ప్రధానిని కలిసిన తర్వాత కేసీఆర్, కేటీఆర్ గార్లపై కేసులు పెడుతామని అంటున్నాడు అంటే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్పా ఇంకో ఆలోచన లేదు.
తాము ఎప్పుడూ ప్రొటోకాల్ ను ఉల్లంఘించలేదన్నారు. కానీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రధానిని కలిసిన తర్వాత తన సోదరుడు తిరుపతి రెడ్డి తన నియోజకవర్గ ఇన్ చార్జి అని సీఎం చెప్పుకున్నారన్నారు. పార్టీ పరంగా ఇన్ ఛార్జి అయితే తమకు ఇబ్బంది లేదన్నారు. కానీ అధికారిక సమావేశాల్లో ఎందుకు పాల్గొంటున్నారని ప్రశ్నించారు. తిరుపతి రెడ్డికి కలెక్టర్ ఎందుకు ఎదురెళ్లి స్వాగతం చెబుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగేతర శక్తులను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నట్లు కదా? అని ధ్వజమెత్తారు. మా కుటుంబంలో అధికారికంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ఎన్నికై ప్రజాసేవ చేస్తున్నామన్నారు. గుమ్మడి నర్సయ్య వంటి మహోన్నతమైన వ్యక్తిని గేటు బయట నిలబెట్టి రేవంత్ రెడ్డి అహంకారాన్ని ప్రదర్శించారన్నారు.
నెలకు రూ.6500 కోట్ల వడ్డీ కడుతున్నామని సీఎం అబద్దాలు చెబుతున్నారన్నారు. కాగ్ నివేదిక ప్రకారం ఏ నెల కూడా రూ.2600 కోట్లకు మించి వడ్డీ కట్టలేదన్నారు. ప్రతీ నెల రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తున్నదని సీఎం చెబుతున్నారని.. కానీ కాగ్ ప్రకారం రూ.12 వేల కోట్లకు మించి ఈ ఏడాది ఆదాయం రాలేదన్నారు. రాష్ట్రంలో ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణం హైడ్రా అని అన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా 18 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసిందన్నారు. కానీ హైడ్రా విధ్వంసం వల్ల దాని ద్వారా ఆదాయం 5800 కోట్లకు పడిపోయిందన్నారు.
Kavitha Vs Revanth: తెలంగాణలో మూడు హత్యలు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు!
మూడు అనుమానాస్పద హత్యలు జరిగాయంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు MLC కవిత కౌంటర్ ఇచ్చారు. న్యాయవాది సంజీవ రెడ్డి కోర్టులో గుండె పోటుతో మరణించారన్నారు. భూతగాదాలతోనే రాజలింగమూర్తి హత్య జరిగిందన్నారు. దుబాయ్ లో ఒక వ్యక్తి నిద్రలోనే చనిపోయారని పత్రికల్లో వచ్చిందన్నారు.
Kavitha Vs Revanth Reddy