/rtv/media/media_files/2025/04/13/xUmJd07qFhj3KAKg5hIM.jpg)
BRS Leader Rakesh Reddy
బీఆర్‌ఎస్ నేత రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము పూర్తి ఆధారాలతో గ్రూప్-1 అవకతవకలను బయటపెట్టామని తెలిపారు. టీజీపీఎస్సీకి క్షమాపణ చెప్పే ప్రసక్తిలేదన్నారు. అవకతవకలపై ప్రశ్నలకు టీజీపీఎస్సీ ఎందుకు సమాధానాలివ్వట్లేదని ప్రశ్నించారు. నోటీసులు జారీ చేయడంపై ఉన్న శ్రద్ధ అభ్యర్థులకు జవాబు ఇవ్వడంలో ఉండాలన్నారు.
Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ
'' గ్రూప్ -1 ఫలితాల్లో టాప్ 500లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి లేదు. ఇలా ఎందుకు జరిగింది ?. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేరువేరు హాల్‌టికెట్లు ఎందుకు ఇచ్చారు. మహిళలు, పురుషులకు వేరువేరు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేశారు ?. మొత్తం 46 సెంటర్లు ఉంటే 2,3 సెంటర్ల నుంచే టాపర్స్ ఎందుకు వచ్చారు ?.
Also Read: జలియన్ వాలాబాగ్ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?
రిటైర్డ్, కాంట్రాక్టు లెక్చరర్లతో గ్రూప్-1 పేపర్లు ఎందుకు దిద్దించారు. మేము ఇందులో జరిగిన అవకతవకలపై పోరాటం కొనసాగిస్తాం. దీనిపై న్యాయ విచారణ జరపాలి. ఇలా చేస్తే మేము ఆధారాలు చూపిస్తాం. నేను టీజీపీఎస్సీపై పరువు నష్టం దావా వేస్తానని'' రాకేశ్ రెడ్డి అన్నారు. ఇదిలాఉండగా గ్రూప్ -1 ఫలితాలు వచ్చాక తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.
Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్
group-1 | telugu-news | brs | congress