/rtv/media/media_files/2025/01/23/jP53TrG5QAvskS3uSD3N.webp)
Bodhan Ex MLA Shakil
Bodhan Ex MLA Shakil : వరుస వివాదాలతో వార్తల్లో నిలిస్తోన్న నిజామాబాద్(Nizamabad) జిల్లా బోధన్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మరో షాక్ తగిలింది. బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.19 కోట్ల అప్పు సకాలంలో తీర్చలేదని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు షకీల్‌కు నోటీసులు జారీ చేశారు. గడువులోగా బకాయిలు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని అధికారులు వార్నింగ్ ఇచ్చారు.
Also Read: అయ్యో బిడ్డలు.. పిల్లలకు ఉరేసి చంపిన తల్లి.. ఆ తర్వాత
రూ.19 కోట్లు ఎగ్గొట్టిన బీఆర్ఎస్ నేత..
ఇప్పటికే తన కొడుకు హైదరాబాద్ ప్రజాభవన్(Praja Bhavan) వద్ద చేసిన యాక్సిడెంట్ కేసులో సతమతమవుతున్న మాజీ ఎమ్మెల్యే షకీల్ కు తాజాగా.. బ్యాంక్ నోటీసులు రావడం చర్చానీయంశంగా మారింది. గత ఎన్నికల్లో బోధన్ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన షకీల్ వ్యాపార అవసరాల నిమిత్తం స్టేట్‌బ్యాంక్‌ఆఫ్ ఇండియా నుంచి అప్పు తీసుకున్నట్లు తెలిసింది. మొత్తం రూ.19 కోట్ల అప్పు తీసుకోగా ఆ మొత్తాన్ని ఆయన సకాలంలో చెల్లించలేదు. దీంతో ఎస్బీఐ నోటీసులు ఇచ్చింది. కాగా ఈ మొత్తాన్ని చెల్లించడానికి కొత్త గడువును ఇచ్చిన బ్యాంక్ ఆ మొత్తాన్ని నియమిత గడువులోగా చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని నోటీసులు జారీ చేసింది. కాగా బ్యాంక్ అధికారులు జారీ చేసిన నోటీసులపై ఇప్పటివరకు మాజీ ఎమ్మెల్యే షకీల్ నుంచి గాని అలాగే ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి క్లారిటీ, వివరణ రాలేదు.
Also Read: 72 గంటలు భార్య శవాన్ని ఉడికించి.. ఆరబెట్టి పొడిచేసి.. ఇదొక భయంకరమైన హత్య!
అయితే గతంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్ ర్యాష్ డ్రైవింగ్ అరెస్ట్ అయ్యారు. గత ఏడాది డిసెంబర్ 24న జరిగిన పంజాగుట్ట హిట్ అండ్ రన్ కేసులో(Hit and Run Case) ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.. ఈ ఘటన అనంతరం రహిల్ అమిర్ దుబాయ్ పారిపోయాడు. రహిల్ హిట్ అండర్ రన్ కేసు అనంతరం.. ఊహించని పరిణామాలు తెరపైకి వచ్చాయి. రహిల్ దేశం దాటడంలో అధికారులు సాయపడినట్టు తేలింది.. ఈ ఘటన అనంతరం పంజాగుట్ట, బోధన్ సీఐలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. షకీల్ కుమారుడు విదేశాలకు పారిపోవడానికి సహకరించారని తేలడంతో వారిని అరెస్టు చేశారు. రహిల్‌కు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.
Also Read : GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!
కొంతకాలం తర్వాత హైదరాబాద్ వస్తుండగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో(Shamshabad Airport) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరచగా అతనికి న్యాయస్థానం శిక్ష ఖరారు చేయడంతో జైలుకు తరలించారు. అంతకు రెండు సంవత్సరాల ముందు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో షకీల్ కారు ఢీకొనడంతో ఒక చిన్నారి దుర్మరణం చెందిన విషయం విధితమే. ఇప్పటికే ఈ రెండు కేసులతో షకీల్ సతమతమవుతుండగా తాజాగా బ్యాంక్ నోటీసులతో మరోసారి వార్తాల్లో నిలిచాడు.
Also Read : Maha kumbh mela: ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ