Brother gift : చెల్లిపెండ్లికి అన్న అరుదైన కానుక..కన్నీటి పర్యంతమైన పెండ్లి వేడుక

తండ్రిలేని చెల్లెకు పెండ్లి చేయడమే కాకుండా ఆ పెండ్లికి ఒక అరుదైన బహుమతి ఇచ్చాడో అన్నయ్య. పెళ్లి సందర్భంగా వధువుకు కట్న కానుకలు, బంగారం, చీరలు, భూములు, ఇండ్లు విలువైన వస్తువులు కానుకగా ఇవ్వడం కామన్ అనుకున్నాడో ఏమో కానీ జీవితంలో మరిచిపోలేని కానుక ఇచ్చాడు.

New Update
brother-wedding-gift

brother-wedding-gift

Brother gift : తండ్రిలేని చెల్లెకు పెండ్లి చేయడమే కాకుండా ఆ పెండ్లికి ఒక అరుదైన బహుమతి ఇచ్చాడో అన్నయ్య. పెళ్లి సందర్భంగా వధువుకు కట్న కానుకలు, బంగారం, చీరలు, భూములు, ఇండ్లు విలువైన వస్తువులు కానుకగా ఇవ్వడం కామన్ అనుకున్నాడో ఏమో కానీ జీవితంలో మరిచిపోలేని కానుక ఇచ్చాడు. అతను ఇచ్చిన కానుక ఆమెనే కాదు అక్కడ ఉన్నవారందరినీ కన్నీళ్లు పెట్టించింది. హనుమకొండ జిల్లా ఐనవోలుకు చెందిన వడిచెర్ల శ్రీనివాస్​ గత ఏడాది జనవరి 22న చనిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతను అతడి కొడుకు కమల్​హాసన్​ తీసుకున్నాడు.

Also Read :  విడదల రజనీపై విచారణ.. అనుమతి కోసం గవర్నర్ కు లేఖ

 ఇటీవల చెల్లె శివాని పెండ్లి కుదరగా.. తండ్రి లేదన్న బాధ ఆమెను వేధించింది. దీంతో తన చెల్లికి తండ్రి లేడన్న వెలితిని తీర్చాలనే ఉద్దేశంతో కమల్​ హాసన్​ దాదాపు రూ.లక్షన్నర ఖర్చు పెట్టి ఎవరికీ తెలియకుండా తన తండ్రి ఫైబర్​ విగ్రహాన్ని చేయించాడు. సోమవారం చెల్లెలు పెండ్లి జరగగా, విగ్రహాన్ని తన తల్లి అనురాధ సమక్షంలో గిఫ్ట్​గా ఇచ్చాడు. తండ్రి విగ్రహాన్ని చూసిన వధువుతో పాటు పెండ్లిలో పాల్గొన్న కుటుంబ సభ్యులు, బంధువులు భావోద్వేగానికి గురయ్యారు. ఆరడుగుల ఎత్తుతో తండ్రి విగ్రహాన్ని తయారు చేయించిన అన్నయ్య ఆ పెళ్లి వేడుకలో వధువుకు అపురూప కానుకగా ఇచ్చాడు.  

Also Read: వేశ్యతో ప్రేమలో పడిన కథ.. 'అనోరా' చిత్రానికి ఏకంగా ఐదు కేటగిరీల్లో ఆస్కార్ అవార్డు!

వడిచర్ల శ్రీనివాస్ గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందాడు. అతనికి కూతురు శివాని అంటే ప్రాణం. సోమవారం(మార్చి3) కూతురు వివాహం జరిగింది. అయితే ఆ వివాహ వేడుక సందర్భంగా తండ్రి లేని చెల్లికి చెరగని జ్ఞాపకంగా ఉండాలని భావించిన మృతుడి కొడుకు కమలహాసన్ తన చెల్లెలికి ఆరడుగుల ఎత్తుతో తన తండ్రి శ్రీనివాస్ విగ్రహాన్ని తయారు చేయించి ఇచ్చాడు. పెళ్లి వేడుకలో అచ్చం తన తండ్రిని పోలిన విగ్రహాన్ని చూసిన వధువు శివాని బోరున విలపించింది. వధువుతో సహా అక్కడున్న వారంతా బావోద్వేగానికి గరై కన్నీరు పెట్టుకున్నారు. 

Also Read: హైవేపై ఘోర ప్రమాదం.. బైక్ ను తప్పించబోయి బస్సు పల్టీలు.. 36 మందికి గాయాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు