/rtv/media/media_files/2025/01/27/nXfqNbbF7NYLhXascDl4.webp)
TGRTC FREE BUS
Free Buses : తెలంగాణలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళల ఫ్రీ బస్సులు నిలిచిపోనున్నాయి.తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడమే దీనికి కారణం.దీర్ఘకాలంగా ఆర్టీసీలో పేరుకుపోయిన, సమస్యలు, కార్మికుల హక్కుల సాధనకోసం సమ్మెబాట పట్టేందుకు కార్మికులు సిద్ధమయ్యారు.
నాలుగేళ్ల తర్వాత ఆర్టీసీ కార్మికులు తిరిగి సమ్మె బాట పట్టడం గమనార్హం. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు కార్మిక సంఘాలు నోటీసు ఇవ్వనున్నాయి. ఇప్పటికే జేఏసీగా ఏర్పడిన ఆర్టీసీ కార్మిక సంఘాలు యజమాన్యం అవలంభిస్తోన్న విధానాలపై ఫైర్ అయ్యాయి. ఒకవైపు ఆర్టీసీనీ ప్రైవేటుపరం చేయమని చెబుతూనే ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతూ వాటికి ప్రైవేటు వారిని డ్రైవర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల హక్కులు హరిస్తున్నారని జేఏసీ మండిపడింది.
చాపకింద నీరులా ప్రైవేటు డ్రైవర్లను ప్రవేశపెడుతూ డ్రైవర్ల ఉద్యోగానికి ఎసరు పెట్టేలా వ్యవహరిస్తున్నారని జేఏసీ ఆరోపిస్తోంది. దీనివల్ల ఉద్యోగుల భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. ఇక ఆర్టీసీలో సర్వీసుల్లో ఉన్నవారి సమస్యలే కాకుండా..రిటైర్డ్ అయిన వారి సమస్యలు కూడా ఇంత వరకు తీరలేదని అంటున్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న బకాయిలు, పేస్కేళ్లు, డీఏ బకాయిలు, చెల్లించని సీసీఎస్ బకాయిలు, ప్రభుత్వంలో విలీనం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాల సవరణ, యూనియన్ల ఏర్పాటు, ఇలా ఎన్నో హామీలు అమలుకు నోచుకోలేదని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలన్నింటిపై ఆర్టీసీ సంస్థకు నేడు బస్ భవన్‌లో సమ్మె నోటీసు ఇస్తున్నామని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.
ఇక తెలంగాణ ఆర్టీసీలో సమ్మె నోటీసు ఇవ్వడంతో మహిళలు ఉపయోగించుకుంటున్న ఫ్రీ బస్సు సర్వీసులకు విఘాతం కలుగనుంది. రోజు వేలాది మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం వల్ల బస్సుల రవాణా పెరగడంతో పాటు ఆదాయం పెరిగింది. దీంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎలక్ర్టిక్ బస్సులను ప్రవేశపెడుతోంది. ఇక్కడి వరకు భాగానే ఉన్నప్పటికీ ఎలక్ర్టిక్ బస్సుల కారణంగా ఆర్టీసీ డ్రైవర్ల ఉద్యోగాలకు ప్రమాదంగా పరిణమించిందని వారు వాపోతున్నారు. ఎలక్ర్టిక్ బస్సు డ్రైవర్లుగా ప్రైవేటు వ్యక్తులను తీసుకోవడం వల్ల తమ ఉద్యోగాలు కోల్పొవలసి వస్తుందని ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీంతో సమ్మె తప్ప మరో మార్గం లేదని వాపోతున్నారు.
Also Read: Hyderabad: మీర్‌పేట్ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు... ఆ సినిమా ప్రేరణతోనే హత్య!
ఇకఈ సమ్మెతో బస్సు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రస్తుతం మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తున్నది. ఒకవేళ సమ్మెకు వెళితే ఉచితబస్సునిలిచిపోయే అవకాశం ఉంది. కాగా సమ్మె విషయంలో ప్రభుత్వం,ఆర్టసీ యజమాన్యం తీసుకునే చర్యలపై ఉత్కంఠ నొలకొన్నది.