BJP: కరీంనగర్‌ కార్పొరేషన్‌లో బిగ్‌ట్విస్ట్‌.. బీజేపీకే మేయర్‌ పీఠం

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మరో ట్విస్టు చోటుచేసుకుంది. చివరికి బీజేపీయే మేయర్‌ పదవిని దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన కొలగాని శ్రీనివాస్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. 34 మంది కార్పొరేటర్ల సపోర్ట్‌తో మేయర్ పీఠాన్ని కమలం పార్టీ సొంతం చేసుకుంది.

New Update
BJP won Karimnagar Corporation

BJP won Karimnagar Corporation

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మరో ట్విస్టు చోటుచేసుకుంది. చివరికి బీజేపీయే మేయర్‌ పదవిని దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన కొలగాని శ్రీనివాస్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. 34 మంది కార్పొరేటర్ల సపోర్ట్‌తో మేయర్ పీఠాన్ని కమలం పార్టీ సొంతం చేసుకుంది. ఇక డిప్యూటీ మేయర్‌గా కూడా బీజేకి చెందిన సునీల్‌ రావు ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి ప్రకటించారు. 

Also Read: కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం..  స్పాట్ లో 8 మంది కార్మికులు

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కరీనంగర్‌ కార్పొరేషన్‌లో 30 స్థానాల్లో గెలిచింది. స్వతంత్రగా గెలిచిన కొందరు కార్పొరేటర్లు బీజేపీలో చేరడంతో మేయర్‌ పదవి బీజేపీకే వస్తుందని అనుకున్నారు. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ సభ్యులు, ఇండిపెండెంట్‌గా గెలిచిన కార్పొరేటర్లు కలిసి కార్పొరేషన్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని నగర శివారులో ఓ రిసార్టులో వేర్వేరుగా క్యాంపులు ఏర్పాటు చేశారు. 

Also Read: ఢిల్లీ పేలుళ్ల కేసులో కొత్త కోణం‘అన్సార్‌ ఇంటీరియం’ పేరుతో టెర్రరిస్టు గ్రూపు

కానీ చివరికి ఊహించని ట్విస్టు చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ తటస్థంగా వ్యవహరించింది. కాంగ్రెస్‌ మేయర్ అభ్యర్థికి 21 మంది కార్పొరేటర్లు మాత్రమే మద్దతు పలికారు. దీంతో ఇది బీజేపీకి కలిసొచ్చింది. 34 మంది కార్పొరేటర్లతో కమలం పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది

Advertisment
తాజా కథనాలు