BJP: కరీంనగర్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకున్న బీజేపీ.. కమలం గూటికి మరో ఇద్దరు స్వంతంత్రులు

మున్సిపల్‌ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో బీజేపీలో మరో ఇద్దరు స్వంతంత్రులు గెలిచారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో వారు పార్టీలోకి చేరారు.

New Update
Bandi Sanjay

Bandi Sanjay

మున్సిపల్‌ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో బీజేపీలో మరో ఇద్దరు స్వంతంత్రులు చేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో వారు పార్టీ చేరారు. 17వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ వేముల కవిత చంద్రశేఖర్, 39వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ మాసం గణేష్ కమలం కండువ కప్పుకున్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్ మేజిక్ ఫిగర్‌ 34 కాగా.. ఇద్దరు స్వతంత్రులు చేరడం, బండి  ఎక్స్‌ ఆఫీషియో ఓటుతో కలిపి బీజేపీ బలం 35కు చేరింది. తమ పార్టీతో మరో అయుదుగురు టచ్‌లో ఉన్నట్లు బండి సంజయ్ తెలిపారు. 

Also Read: మహారాష్ట్రలో కీలక పరిణామం.. NCP విలీనం ఉండదన్న సంజయ్ రౌత్

కరీంగర్‌ కార్పొరేషన్‌లో 66 డివిజన్లు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 34 కాగా ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. బీజేపీ 30 డివిజన్లలో విజయం సాధించింది.  ఇక కాంగ్రెస్‌ 14, బీఆర్‌ఎస్‌ 9, స్వతంత్రులు 8, MIM 3, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ 2  స్థానాల్లో గెలుపొందాయి. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులను బీజేపీ చేర్చుకోవడంతో ఆ పార్టీ బలం బండి సంజయ్‌ ఓటుతో కలిపి 35కు చేరింది. ఫిబ్రవరి 16న ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజున మధ్యాహ్నం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహించనున్నారు.

Also Read: 'కొవిడ్ కన్నా పెద్దది జరగబోతోంది'.. ఏఐపై హైప్‌రైటర్ సీఈవో సంచలన హెచ్చరిక

ఫలించిన హిందుత్వ ఎజెండా

బండి సంజయ్ పాటించిన 'హిందుత్వ ఎజెండా' కరీంనగర్‌లో ఫలించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, మజ్లిస్ రెండు ఒక్కటేనంటూ బండి సంజయ్ పదే పదే ప్రచారం చేశారు. ఇది ఓటర్లపై బలమైన ప్రభావం చూపింది. మరోవైపు కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న సమన్వయ లోపం ఉండటం వల్ల ఇది బీజేపీకి ప్లస్‌ పాయింట్ అయ్యింది. అయితే అక్కడ గతంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ ఈసారి మాత్రం చాలా తక్కువ స్థానాలకే పరిమితమయ్యింది. గతంలో బీఆర్ఎస్ 33 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు కేవలం 9 స్థానాలతోనే సరిపెట్టుకుంది. మజ్లిస్ బలం కూడా 6 స్థానాల నుంచి 3కి పడిపోయింది. రాష్ట్రంలో కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ సొంతం చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Advertisment
తాజా కథనాలు