/rtv/media/media_files/2025/04/03/etRrDKHMnUvYfUWNjgGn.jpg)
Bird Flu
Bird Flu: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలవరపెడుతోంది. మొన్నటి వరకు ఈ భయం విపరీతంగా వ్యాపించింది. అంతా సద్దుమణిగిందనుకునేలోపే మళ్లీ వైరస్ విజృంభిస్తోంది. ఇటీవల ఏపీలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల బాలిక మృతి చెందినట్టు ICMR ధృవీకరించింది. దీంతో మళ్లీ భయం మొదలైంది. తాజాగా హైదరాబాద్‌లోనూ బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తోంది. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ కోళ్ల ఫామ్‌లో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. కొత్తగూడెం ప్రాంతంలోని సాయిగణేశ్ పౌల్ట్రీ ఫౌంలో గత నెల 24వ తేదీ నుంచి ప్రతిరోజూ 200 నుంచి 300 కోళ్లు చనిపోతుందడంతో ఫామ్ యజమాని రాజశేఖర్‌రెడ్డికి అనుమానం వచ్చింది.
వరుసగా కోళ్లు చనిపోవడంతో..
దీంతో వెటర్నరీ అధికారులను సంప్రదించాడు. అధికారులు అక్కడికి చేరుకుని ఫామ్‌లోని కోళ్ల రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపారు. బెర్హూతో కోళ్లు చనిపోతున్నాయని నివేదిక వచ్చింది. దీంతో చనిపోయిన కోళ్లతో పాటు బతికి ఉన్న కోళ్లను సైతం జేసీఈ సాయంతో ఒక పెద్ద గుంత తీసి పాతిపెట్టారు. ఫామ్ యజమాని స్పందిస్తూ వరుసగా కోళ్లు చనిపోవడంతో తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపాడు. సంబంధిత వెటర్నరీ అధికారులను వివరణ కోరేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా స్పందించలేదు.
ఇది కూడా చదవండి: ఎండాకాలం వేడి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది?
ప్రస్తుతం ఫాంలోని కోళ్లతోపాటు కోడిగుడ్లను ఎవ్వరికీ విక్రయించొద్దని నిర్వాహకులకు అధికారులు సూచించారని చెబుతున్నారు. దీంతో మిగతా కోళ్ల ఫామ్‌ల యజమానుల్లో కలవరం మొదలైంది. అటు నగరవాసుల్లో కూడా భయాందోళన నెలకొంది. మరోవైపు అధికారులు మాత్రం భయపడాల్సిందేమీ లేదని, మాంసం బాగా ఉండికించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో జనాలు కోడి మాంసం తినాలంటేనే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా మటన్, చేపల విక్రయాలు భారీగా పెరిగాయి.
ఇది కూడా చదవండి: వేసవిలో దోసకాయ రసం తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
( bird-flu | bird flu case | bird flu effect in telangana latest-news )