Hyderabad : కేజీ చికెన్ రూ.150, బిర్యానీ రూ.50.. నాన్ వెజ్ ప్రియులకు పండగ లాంటి వార్త!

బర్డ్ ఫ్లూ కారణంగా హైదరాబాద్‌లో చికెన్ ధర కిలో రూ.150లకి తగ్గింది. అదే సమయంలో బిర్యానీ ధరలు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం రూ.50లకే బిర్యానీ దొరికే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పలుచోట్ల ఇంత తక్కువ ధరకి బిర్యానీ అమ్ముతున్నట్లు టాక్.

New Update
bird flu in hyderabad chicken prices drop rs 100 per kg and biryani only rs 50

bird flu in hyderabad chicken prices drop rs 100 per kg and biryani only rs 50

బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే. ఎన్ని సార్లు తిన్నా కొందరికి విసుగు పుట్టదు. రోజూ తినాలని అనుకుంటారు. అలాంటి వారికి ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అరే మావా ఇది విన్నావా.. త్వరలో బిర్యానీ కేవలం రూ.50లకే దొరికే అవకాశం ఉందట. అవును నిజమే.. ఎందుకంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, రాజస్థాన్, ఛతీస్‌ఘడ్‌లో సైతం బర్డ్ ఫ్లూ తీవ్రంగా వ్యాపించింది. దీని కారణంగానే ప్రస్తుతం చికెన్ రేట్లు బాగా పడిపోయాయి. 

Also Read : ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!

కిలో చికెన్ రూ.150

మొన్నటి వరకు చికెన్ ధర కిలో రూ.250 నుంచి రూ.300 వరకు ఉండేది. కానీ ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ కారణంగా కేవలం కిలో రూ.150 లకే దొరికేస్తోంది. అయినా.. ఈ వైరస్ కారణంగా ప్రజలు చికెన్, గుడ్లు కొనేందుకు కాస్త జంకుతున్నారు. చికెన్ తింటే ఏమవుతుందో ఏంటో అని భయపడుతున్నారు. 

Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే

Also Read: Trump-musk: మస్క్‌ కు హై పవర్‌ ఇచ్చిన ట్రంప్‌...ఇక కోతలే..కోతలు!

ఈ తరుణంలోనే చికెన్ కొనడానికి వెనకడుగు వేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో చికెన్ అమ్మకాలు దాదాపు 50 శాతానికి పైగా పడిపోయాయి. దీని కారణంగానే ఇప్పుడు బిర్యానీ ధరలు కూడా భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Trump-musk: మస్క్‌ కు హై పవర్‌ ఇచ్చిన ట్రంప్‌...ఇక కోతలే..కోతలు!

 రూ.50 లకే బిర్యానీ

ఈ వైరస్ కారణంగా చికెన్ బిర్యానీ ధరలు సైతం భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ చాలా రెస్టారెంట్లు, హోటళ్లలో సింగిల్ బిర్యానీ పాకెట్ ధర రూ.120 నుంచి రూ.140 మధ్య ఉంది. ఇప్పుడు వీటి ధరలు పడిపోయే ఛాన్స్ కనిపిస్తోంది. కేవలం రూ.50 లకే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అక్కడక్కడ రూ.50లకే విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వైరస్ కారణంగా బిర్యానీని సాయంత్రం వేళ ఇంత తక్కువ ధరకే అమ్ముతున్నట్లు సమాచారం. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు