Moinabad drugs case :  మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎస్కేప్ అయిన ఆ కీలక నేతలు ఎవరు?

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొందరు కీలక నేతలు ఎస్కేప్ అయ్యారా..? వారిని గోడ దాటించేందుకే వ్యూహాత్మకంగా పోలీసులపై కాల్పులు జరిపారా..? పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించిన పలు అంశాలను పరిశీలిస్తే ఇలాంటి అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి.

New Update
FotoJet (13)

Former MLA Pilot Rohit Reddy drugs case

Moinabad drugs case : మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొందరు కీలక నేతలు ఎస్కేప్ అయ్యారా..? వారిని గోడ దాటించేందుకే వ్యూహాత్మకంగా పోలీసులపై కాల్పులు జరిపారా..? పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించిన పలు అంశాలను పరిశీలిస్తే ఇలాంటి అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. శనివారం రాత్రి జరిగిన ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు నేడు విడుదల చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం.. డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు సెర్చ్ వారెంట్ తో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కు వెళ్లారు. లోపలికి వెళ్లగానే బుల్లెట్ సౌండ్ వినపడడంతో అలర్ట్ అయ్యారు. తాము పోలీసులం అని గట్టిగా అరిచారు. అయినా వినకుండా మరో రెండు సార్లు కాల్పులు జరిపారు. 'మీరు కాల్చేయండి.. ఏం జరిగినా నాదే బాధ్యత.. నేను చూసుకుంటాను..' అన్న మాటలు పోలీసులకు వినిపించాయి. 

దీంతో మరో సారి పోలీసులు గట్టిగా అరిచి వార్నింగ్ ఇవ్వడంతో కాల్పులు ఆగాయి. ఆ తర్వాత లోపలికి వెళ్లిన పోలీసులు అక్కడ ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సెర్చ్ వారెంట్ అందించి తనిఖీలు చేపట్టారు. అక్కడ ఉన్న గన్ ను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని నమిత్ శర్మగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ రివాల్వర్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డిదిగా గుర్తించారు. పోలీసుల రాకను పసిగట్టి వారిని భయ పెట్టేందుకే ఫైరింగ్ చేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. 


అయితే.. పోలీసులు వచ్చారని తెలిసిన తర్వాత కూడా ఏ ధైర్యంతో అతడు ఫైరింగ్ చేశాడు? అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. పోలీసులను కొద్ది సేపటి వరకు ముందుకు రాకుండా అయోమయానికి గురి చేసి ఈ లోపు ముఖ్యులను ఎస్కేప్ చేయడం కోసమే ఇలా చేశారన్న ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాలోనూ ఈ అంశం చక్కర్లు కొడుతోంది. అసలు దొంగలు వేరే ఉన్నారని.. వారు సైలెంట్ గా ఎస్కేప్ అయ్యారని కొందరు పోస్టులు పెడుతున్నారు. పోలీసులు కూడా కాల్పుల వెనుక అసలు కారణం ఏంటనే కోణంలో లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కాల్పులు జరిపిన నమిత్ శర్మ, గన్ యజమాని రితేష్‌ రెడ్డి, ఆయన సోదరుడు పైలట్ రోహిత్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో పిటిషన్ వేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అసలేంజరిగిందంటే..

 తాండూరు మాజీ ఎమ్మెల్యే (బీఆర్‌ఎస్‌) పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి చెందిన మొయినాబాద్‌ ఫాంహౌస్‌ లో డ్రగ్స్‌ పార్టీ, కాల్పుల ఘటన సంచలనంగా మారింది. వివరాల ప్రకారం మొయినాబాద్‌లోని పైలెట్‌ రోహిత్‌ రెడ్డి కి చెందిన ఫాంహౌస్‌ లో డగ్స్‌ పార్టీ జరుగుతుందన్న సమచారంతో శనివారం రాత్రి ఈగల్‌ బృందాలు మెరుపుదాడులు నిర్వహించాయి. ఆ సమయంలో డ్రగ్స్‌ పార్టీలో ఉన్న నమిత్ శర్మ అనే వ్యక్తి మొదట ఒక రౌండ్‌ గాలిలోకి కాల్పులు జరపడంతో పాటు నేరుగా ఈగల్‌ బృందంపై మూడ రౌండ్లు కాల్పులు జరిపి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అక్కడ పరిస్థితి గందరగోళానికి దారి తీయడంతో  స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌వోటీ) సమాచారం అందించారు. దీంతో వారు రంగంలోకి దిగి సోదాలు చేయగా  సోదాల్లో 2 గ్రాముల కోకైన్‌, ఇతర మత్తు పదార్థాలతోపాటు రివాల్వర్‌ లభించినట్లు తెలిపారు. కాగా రోహిత్‌ రెడ్డి సోదరుడు రితీశ్‌ రెడ్డి కి చెందిన లెసెన్స్‌డ్‌ గన్‌తో నమిత్‌ శర్మ కాల్పులు జరిపినట్లు పోలీసులు నిర్ధారించారు.  

కాగా అక్కడ మొత్తం 9మంది పురుషులతో పాటు ఒక మహిళ డ్రగ్స్‌ పార్టీ చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీలో పైలెట్‌ రోహిత్‌ రెడ్డితో పాటు  ఏపీ ఏలూరు ఎంపీ పుట్ట మహేశ్‌ యాదవ్‌, మొరగనేని రమేశ్‌, వి.శ్రావణ్‌ కుమార్‌, నల్లపనేని విజయ్‌ కృష్ణ, రితీశ్‌ రెడ్డి, నమిత్‌ శర్మ తదితరులు ఉండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా మూడు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు కావడంతో ఈ విషయం సంచలనంగా మారింది. ఎపీ ఎంపీ మహేశ్‌ యాదవ్‌,రోహిత్‌ రెడ్డితో పాటు మరికొంతమందికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది.  కాగా   డ్రగ్స్ పార్టీలో కాల్పులు జరపడం పట్ల పోలీసులు సీరియస్‌ అయ్యారు. ఎవరిని తప్పించడానికి కాల్పులు జరిగాయి? అనే కోణంలో ఫోరెన్సిక్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది.
 
ఫాంహౌస్‌లో విస్తృత తనిఖీలు

కాగా  ఫాంహౌస్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ఫాంహౌస్‌లోకి ఎవరెవరు వచ్చారు? పార్టీలో ఎంతమంది పాల్గొన్నారు. అసలు పార్టీ ఎవరు అరెంజ్‌ చేశారు. వీరంతా కేవలం పార్టీ కోసమే ఇక్కడ సమావేశమయ్యారా? మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.  వివరాల కోసం సీసీటీవీ ఫుటేజీ డీవీఆర్ ను సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో మొయినాబాద్ లో భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ పాలన హయాంలోనే డ్రగ్స్‌ దందా ఎక్కువైందని అధికార పార్టీ ఆరోపించడమే కాకుండా దానికి ఆ పార్టీ అగ్రనేతలకు సంబంధం ఉందని స్వయంగా ముఖ్యమంత్రి ఆరోపిస్తున్న క్రమంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే డగ్స్‌ పార్టీలో పట్టుపడటం బీఆర్‌ఎస్‌కు మింగుడుపడని అంశమనే చెప్పాలి.  

Advertisment
తాజా కథనాలు