BIG BREAKING: బండిసంజయ్‌కు బిగ్‌ షాక్‌...మోడీ సభనుంచి ఔట్‌

తెలంగాణ బీజేపీలో అత్యంత క్రియాశీలక నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆదివారం నగరంలో జరగనున్న ప్రధాని అధికారిక కార్యక్రమాలతో పాటు సికింద్రాబాద్ పరేడ్ మైదానం సభ నుంచి బండి సంజయ్ పేరును బీజేపీ అధిష్ఠానం తొలగించింది.

New Update
bandi sanjay

Big shock for Bandisanjay..

Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో అత్యంత క్రియాశీలక నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు ఊహించని రాజకీయ పరాభవం ఎదురైంది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన వేళ ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం నగరంలో జరగనున్న ప్రధాని అధికారిక కార్యక్రమాలతో పాటు సికింద్రాబాద్ పరేడ్ మైదానం సభకు సంబంధించిన ఆహ్వానితుల జాబితా నుంచి బండి సంజయ్ పేరును బీజేపీ అధిష్ఠానం అనూహ్యంగా తొలగించింది. ఆయన కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన  పోక్సో (POCSO) కేసు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

 ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ సమీపంలోని పెట్రోలియం శాఖకు చెందిన ప్రతిష్టాత్మక 'మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టు'ను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్షదీప్ సింగ్ పూరీ, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపిలతో పాటు స్థానిక కాంగ్రెస్ ప్రతినిధులైన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు అధికారికంగా ఆహ్వానం లభించింది.

కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్నప్పటికీ, ప్రోటోకాల్, ఆహ్వానితుల తుది జాబితాలో బండి సంజయ్ పేరు ఎక్కడా కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ అగ్రనేత, ప్రధాని పాల్గొంటున్న సభకు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి దూరం కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కొడుకుపై పోక్సో కేసు 

బండి సంజయ్‌ను ప్రధాని పర్యటనకు దూరం పెట్టడానికి ఆయన కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన తీవ్రమైన అత్యాచారం, వేధింపుల కేసే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఒక 17 ఏళ్ల మైనర్ బాలికకు బలవంతంగా మద్యం తాగించి, హైదరాబాద్‌ శివార్లలోని మొయినాబాద్‌లో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఆమెపై అత్యాచారానికి, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బండి భగీరథ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు గతంలో రెండుసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్లు సమాచారం. చివరికి ఆమె శనివారం అర్ధరాత్రి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో మొదట్లో కేసు నమోదుకు పోలీసులు వెనుకాడటంతో పోలీస్ స్టేషన్ వద్ద దాదాపు ఆరు గంటల పాటు తీవ్ర ఉత్కంఠ, హైడ్రామా నెలకొంది. చివరికి పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు భగీరథ్‌పై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.

డ్యామేజ్ కంట్రోల్‌లో బీజేపీ అధిష్ఠానం

బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. కేంద్రంలో అధికారంలో ఉండి, మహిళా భద్రతపై నిరంతరం మాట్లాడే బీజేపీకి.. ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడిపైనే ఇటువంటి తీవ్రమైన కేసు నమోదు కావడం పెద్ద ఇబ్బందికరంగా మారింది. ఒకవేళ బండి సంజయ్‌ను ప్రధాని మోడీ సభ వేదికపైకి అనుమతిస్తే ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీలు దీనిని ఆయుధంగా మలుచుకునే ప్రమాదం ఉందని బీజేపీ జాతీయ నాయకత్వం భావించింది. ప్రధాని సభ అభాసుపాలు కాకుండా ఉండేందుకే ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో సంజయ్‌ను పక్కన పెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం.అయితే, ఈ వ్యవహారం వెనుక తన కుమారుడిపై 'హనీ ట్రాప్' జరిగిందంటూ బీజేపీ అంతర్గత వర్గాలు సమర్థిస్తున్నప్పటికీ, అధికారికంగా మాత్రం పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

తెలంగాణ బీజేపీలో తనదైన ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న బండి సంజయ్‌కు, స్వయంగా ప్రధాని సభ నుంచే దూరమవ్వాల్సి రావడం ఆయన రాజకీయ జీవితంలో ఒక పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం ఆయన అనుచరుల్లో, కరీంనగర్ క్యాడర్‌లో తీవ్ర అసంతృప్తిని, నిరాశను నింపింది.

Advertisment
తాజా కథనాలు