/rtv/media/media_files/2025/04/14/TEGDtbi6mLf6ZD9GXYnt.jpg)
BathukammaSarees
Bathukamma Sarees : తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ. పూల పండుగను ఆడబిడ్డలు సంబురంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి ఆడపడుచుకు ఉచితంగా చీరలను అందించింది. ఏటా బతుకమ్మ పండుగకు ముందు పంపిణీ చేసింది. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చీరల పంపిణీ నిలిచిపోయింది.
Also Read: Big Breaking: సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని మళ్ళీ బెదిరింపు..ఈసారి ఇంట్లోకి దూరి మరీ..
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పాత రైతుబజారులో చీరల కట్టలు కుప్పలు,కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. వీటిని రైతుబజారులో ఎవరు పడేశారన్న సందేహం వ్యక్తమవుతున్నది. గత ప్రభుత్వం బతుకమ్మ సందర్భంగా మహిళలకు పంపిణీ చేయడం కోసం కేటాయించిన చీరలను జిల్లాలోని తాండూరుతో సహా పలు ప్రాంతాల్లో అధికారులు అందజేయలేదు.
Also Read: US Dollar: డాలర్ పడిపోతోంది..రూపాయి పెరుగుతోంది..ఏమవుతోంది అమెరికా ఆర్థిక వ్యవస్థకు?
Also Read: Ap Weather Report: ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో వర్షాలు.!
వాటినే తాండూరులో నిరుపయోగంగా ఉన్న పాత రైతుబజారుకు తీసుకొచ్చి వృథాగా పడేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చీరలను చిన్నారులు ఇక్కడి షెడ్లకు కట్టి ఊయలలా వాడుతున్నారు. వీటిని పేదలకు పంపిణీ చేసి ఉంటే ప్రయోజనం ఉండేదని పట్టణ వాసులు పేర్కొంటున్నారు. చీరలను రైతుబజారులో ఎవరు పడేశారో తమకు తెలియదని పురపాలక సంఘం అధికారులు తెలిపారు.. వాటిని చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. అయితే చీరలను అక్కడ ఎవరు వేశారనే విషయం తెలియరాలేదు.
Also Read: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!