/rtv/media/media_files/2025/03/30/Ba1mb9ppiblSTFSs51Ia.jpg)
Ayushman Bharat Old Age Pension Scheme Photograph: (Ayushman Bharat Old Age Pension Scheme)
ఉగాది కానుకగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకం అందుబాటులోకి రానుంది. దీని ద్వారా 70ఏళ్లు దాటిని వృద్ధులు లబ్ధిపొందుతారు. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్ అమలులోకి రానుంది. ఈ పథకం ద్వారా70 ఏండ్లు పైబడిన వృద్ధులకు రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కేంద్ర ప్రభుత్వం అందించనుంది. ఈ స్కీమ్ అమలుకు సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య అధికారులు నెట్ వర్క్ హాస్పిటల్స్ కు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక పరిమితులతో ఎలాంటి సంబంధం లేకుండా.. ఆధార్ కార్డులో ఉన్న వయసు ఆధారంగా కుటుంబంలోని వయోవృద్ధులు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం పొందవచ్చు. రాష్ట్రం మొత్తంగా 1017 ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా ఈ సేవలను సీనియర్ సిటిజన్స్ పొందవచ్చు. రాష్ట్రంలో 416 ప్రైవేట్ హాస్పిటల్స్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ తో ఎమ్ ప్యానెల్ అయి ఉన్నాయి.
70 ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఆయుష్మాన్ భారత్ వయో వందన కార్డు పొందడానికి అర్హులు. ఈ కార్డులను పొందాలంటే beneficiary.nha. gov.in ద్వారా లేదా ఆయుష్మాన్ మొబైల్ యాప్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్, సర్జరీలు, హాస్పిటాలిటీ, మెడిసిన్ ఖర్చులన్నీ కలిపి రూ.5 లక్షల దాకా ఫ్రీగా అందుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లేదా ఇతర ప్రభుత్వ హెల్త్ స్కీమ్‌ల ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు కూడా ఆయుష్మాన్ వయో వందనకు అర్హులే. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారు ఈ స్కీమ్ కింద కూడా ప్రయోజనం పొందొచ్చు. ఆయుష్మాన్ వయో వందన పథకాన్ని దేశంలో చాలా రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి.