/rtv/media/media_files/2026/04/09/wife-kills-husband-2026-04-09-14-54-06.jpg)
Wife kills husband
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అన్నోజిగూడలో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించిన మహిళా ఆ మత్తులో దారుణానికి ఒడిగట్టింది. సోదరులతో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కల్‌పహాడ్ గ్రామం నార్లకుంట తండాకు చెందిన జటావత్ నరేందర్, సోనీ భార్యభర్తలు, వీరికి16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యభర్తలిద్దరూ జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఉన్న అన్నోజిగూడ లక్ష్మీనరసింహ కాలనీలో నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, కుమారుడిని హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారు. కుమార్తె తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ చదువుకుంటోంది. కాగా, నరేందర్, సోనీ ఇద్దరికి కూడా మద్యం సేవించే అలవాటు ఉంది.
రోజు వారి పనులు చేసుకుంటూ జీవించే వారికి వచ్చే సంపాదన మొత్తం తాగడానికే ఖర్చవుతుండటంతో కుటుంబపోషణ భారంగా మారింది. దీంతో మద్యం సేవించిన సమయంలో ఇద్దరి మధ్య తరుచుగా గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం కూడా భార్యభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. అనంతరం రాత్రి నరేందర్ నిద్రపోయాడు. మద్యం మత్తులో ఉన్న సోనీ కోపంతో రగిలి పోయింది. తన సోదరులు నానావత్ రమేశ్, నానావత్ భాస్కర్‌లను పిలిపించుకుంది. జరిగిన విషయం వారికి చెప్పుకుని బాధపడింది. సోదరి కన్నీళ్లు చూసి కరిగిపోయిన వారు బావను చంపాలని నిర్ణయించుకున్నారు. ముగ్గరు కలిసి నరేందర్ మెడకు చీరతో ఉరివేసి, తలను నేలకేసి కొట్టారు. దీంతో తీవ్ర గాయాలతో నరేందర్ మృతి చెందాడు. దీనిపై మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Follow Us