పేదల జోలికి రావొద్దు.. కాంగ్రెస్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన ఓవైసీ పాతబస్తీలోని కూల్చివేతలపై అసదుద్దీన్ ఓవైసీ మొదటిసారి స్పందించారు. నిజమాబాద్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ.. పెదల జోలికి రావద్దని కాంగ్రెస్‌కు వార్నింగ్ ఇచ్చారు. FTL పరిధిలో ఉన్న సచివాలయంతో లేని ఇబ్బంది పేదల ఇళ్లకి ఎందుకని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. By Kusuma 07 Oct 2024 in తెలంగాణ నిజామాబాద్ New Update షేర్ చేయండి పాతబస్తీలోని కూల్చివేతలపై ఎంఐఎమ్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీలో జరిగిన కూల్చివేతలపై మొదటిసారి అసదుద్దీన్ స్పందించారు. నిజామాబాద్‌లో జరిగిన ఎంఐఎం సభలో అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల జోలికి రావద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధికి మద్దతిస్తాం.. కానీ పేదలను ఇబ్బంది పెడితే అసలు ఉరుకునే ప్రసక్తి లేదని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చూడండి: డ్రై ఫ్రూట్స్ నానబెట్టే ఎందుకు తింటారు..? సచివాలయంతో లేని ఇబ్బంది.. సచివాలయం, బాపు ఘాట్‌తో పాటు ఎన్నో ప్రముఖ కట్టడాలు కూడా FTL పరిధిలోనే ఉన్నాయన్నారు. సచివాలయం FTL పరిధిలో ఉన్నప్పుడు లేని ఇబ్బంది.. పేదల ఇళ్లు ఉంటే ఎందుకని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కూల్చివేతల్లో పేదలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఓవైసీ అన్నారు. కాంగ్రెస్ హామీల్లో పేదల సంక్షేమం కూడా ఉందని.. మర్చిపోవద్దని ఓవైసీ అన్నారు. ఇది కూడా చూడండి: Tomato Prices: పెరిగిపోతున్న టమాటా ధరలు..15 రోజుల్లోనే ధరలు ట్రిపుల్! ఇదిలా ఉంటే.. నిన్న హైదరాబాద్‌లో జరిగిన సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరగుతుందని తేల్చి చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు కంపులోనే బతకాలా? అని ప్రతిపక్షాలను నిలదీశారు. మూసీ పరివాహక ప్రజలకు ఇండ్లు కట్టించి వారికి మంచి భవిష్యత్తును అందిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ప్రతీదానికి అడ్డుపడటం కాదు.. మూసీ బాధితులను ఎలా ఆదుకోవాలో సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఇది కూడా చూడండి: ఐదవ రోజు.. మహా చండీ అలంకారణలో దుర్గమ్మ #asaduddin-owaisi #congress-party #hydra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి