హైదరాబాద్ లో అరబ్ షేక్ ల రాక్షస క్రీడ.. 12 ఏళ్ల బాలికలతో కాంట్రాక్ట్ మ్యారేజ్‌

హైదరాబాద్ నడిబొడ్డున అమ్మాయిల బేరం.. పట్టుమని 12 ఏళ్లు నిండని చిన్నారులతో కాంట్రాక్ట్ మ్యారేజ్.. చార్మినార్, మక్కా మసీదు అందాల చాటున అరబ్ షేక్ ల రాక్షస శృంగార క్రీడ.. ఒక్కొక్కడు 30 పెళ్లీలతో చిన్నారుల జీవితాలను చిదిమేసిన ఉలిక్కిపడే స్టోరీ ఈ ఆర్టికల్ లో

author-image
By srinivas
New Update
ఆఇఆఇ

షేక్ అంకుల్ తో నాకు పెళ్లయ్యాకే పీరియడ్స్ మొదలయ్యాయి. 15 రోజుల తర్వాత అతను కనిపించకుండా పోయాడు. కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్తే డాక్టర్ గర్భవతివి అన్నాడు. అరబ్ షేక్‌లు వచ్చి మాతో 10-15 రోజులు హోటళ్లలో గడిపి వెళ్లిపోతారు. చాలా సార్లు విడాకులు కూడా ఇవ్వరు.. ఇది ఓ 15 ఏళ్ల చిన్నారి కన్నీటి కథ. ఇది ఎక్కడో కాదు నిరంతరం పర్యాటకులు, షాపింగ్ ప్రియులతో కలకలలాడే మన ఓల్డ్ సిటీలోనే జరిగింది. మట్టి గాజుల సవ్వడి, గుప్పుమనే అత్తరు వాసనతో మైమరపించే ప్రాంతంలో కళ్లు బైర్లుకమ్మే ఇలాంటి అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. చార్మినార్, మక్కా మసీదు అందాల చాటున రాక్షస శృంగార క్రీడ బయటపడింది. పట్టుమని 12ఏళ్లు కూడా నిండని పసిపిల్లలను చెరుస్తున్న షేక్ ల బాగోతం బట్టబయలైంది. 

హైదరాబాద్ లో అరబ్ షేక్‌ అరాచకాలు సమాజాన్ని కలవరపరుస్తున్నాయి. పట్టుమని పదిహేనేళ్లు కూడా లేని ముస్లిం బాలికలను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. 12 ఏళ్ల అమ్మాయినుంచి యవ్వనంలో ఉన్న వివాహితులను సైతం రోజులు, నెలల కోసం పెళ్లి చేసుకుంటున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే దీని మూలాలు నిజాం యుగంతో ముడిపడి ఉండటం గమనార్హం. లోకల్ ఏజెంట్ ద్వారా షేక్ వివాహ వ్యవస్థ ఇంకా కొనసాగుతోంది. ఇక్కడ నిజాం పాలన ముగియడంతో చాలా మంది అరేబియాకు వలస వెళ్లగా.. ఇక్కడే ఉండిపోయినవారు షేక్ లతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. షేక్ వివాహ వ్యవస్థను కంటిన్యూ చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన వందలాది అమ్మాయిలకు అరబ్ దేశాలకు చెందిన పురుషులతో స్వల్పకాలిక వివాహాలు జరుగుతున్నట్లు Aaj Tak సీక్రెట్ ఆపరేషన్ లో బయటపెట్టింది. 

నెట్‌వర్క్ ఎలా పనిచేస్తుంది.. 


రెండు విడతల్లో చేపట్టిన గ్రౌండ్ రిపోర్టులో ఈ షార్ట్‌టర్మ్ కాంట్రాక్ట్ మ్యారేజ్‌ నెట్ వర్క్ ను గుర్తించినట్లు Aaj Tak తెలిపింది. ఇస్లామిక్ పండితులతో దీనిపై మాట్లాడినపుడు.. చట్టపరమైన అంశాలు ఏవి దీనిని ఆపలేకపోయాయని చెప్పినట్లు వెల్లడించింది.  హైదరాబాదీలకు ముతాహ్.. అంటే అరబ్ షేక్‌లతో స్వల్పకాలిక వివాహాలు డెబ్బైల నుండి జరుగుతున్నాయని వారు చెప్పినట్లు పేర్కొంది. 'ఇది నిజాం కాలం నుంచి మొదలైంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో చౌష్ అని పిలవబడే నిజాంలు తమ వారసత్వాన్ని (పొడవైన, బలమైన పురుషులు) కాపాడుకోవడానికి ఈ చర్యకు పాల్పడుతున్నారు. చౌష్ తన కుటుంబం, భార్యలను విడిచిపెట్టి తమ అవసరాలు తీర్చుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన మహిళలను మాత్రమే పెళ్లి చేసుకోవడం ప్రారంభించారు. వీలైనంత ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చి నిజాం వారతస్వాన్ని పెంపొందించడమే వారి లక్ష్యం. ఇందుకోసం పేదలను టార్గెట్ చేసి వారికి డబ్బు, మంచి భోజనం అందించి కంట్రోల్ లోకి తీసుకుంటారు' అని తెలిపారు.  

ఇస్లాంలో వివాహా ఒప్పందాలు..
ఇస్లాంలో వివాహం అనేది ఒక ఒప్పందం. కానీ వీళ్లది మాత్రం స్పల్పకాలిక ఒప్పందం. అది కూడా కేవలం డబ్బు కోసమే. మహిళలతో పురుషుడు ఎన్ని రోజులు కలిసి ఉంటాడో అన్ని రోజులే వివాహ బంధంలో ఉన్నట్లు. వివాహ ధృవీకరణ పత్రంతో పాటు విడాకుల ధృవీకరణ పత్రాన్ని కూడా ముందే సిద్ధం చేసుకుంటారు. చిన్న వయసు అమ్మాయిలకు వివాహం గురించి తెలియకపోయినా బలవంతంగా షాదీ చేసుకుంటారు. 'షేక్ అంకుల్ తో నాకు పెళ్లయ్యాక అప్పుడే పీరియడ్స్ మొదలయ్యాయి. అయితే 15 రోజుల తర్వాత అతను కనిపించకుండా పోయాడు. అప్పటికే నేను గర్భవతిని. షేక్‌లు వచ్చి 10-15 రోజులు మాతో కలిసి హోటళ్లలో గడిపి వెళ్లిపోతారు. చాలా సార్లు విడాకులు కూడా ఇవ్వరు' అని ఒకమ్మాయి కన్నీరుపెట్టుకుంది. 

ఇండియాకు ఎందుకు వస్తున్నారు?
షేక్ లు తమ దేశాల్లో ఇలాంటి పనులు ఎందుకు చేయడం లేదు? ఇండియాకు ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే అరబ్ దేశాల్లో మొదటి పెళ్లి అరబ్ అమ్మాయితో మాత్రమే చేయాలి. అక్కడ చాలా విషయాలు భిన్నంగా, రూల్స్ కఠినంగా ఉంటాయి. అందుకే షేక్ లు ఇండియాకు ముఖ్యంగా హైదరాబాద్ వస్తున్నారు. ఇక్కడ నచ్చిన అమ్మాయితో పెళ్లి.. కావాలనుకునప్పుడు విడాకులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక తమ కూతురు పెళ్లి ఈడుకు వచ్చిందని తెలపడానికి అనేక ముస్లిం దేశాలలో ఒక పద్ధతి ఉపయోగిస్తారు.  ఒక అమ్మాయి యుక్తవయస్సు వచ్చిన వెంటనే ఇంటిపై ఒక నిర్దిష్ట రంగు జెండా ఎగురవేస్తారు. ప్రజలు అర్థం చేసుకుని వివాహం కోసం సంప్రదించడం ప్రారంభిస్తారు. ఈ విధానం హైదరాబాద్ లోనూ షేక్‌లు అలవాటు చేశారు. జెండా ఎగిరిన ఇంటికెళ్లి భారీ కట్నం చెల్లించి పెళ్లి చేసుకుంటారు. అమ్మాయి తల్లి అయితే అయితే బిడ్డకు పాలివ్వాలంటే భర్త షేక్ అనుమతి తప్పనిసరి.

రంజాన్ సమయంలో భారీ తాకిడి..
రంజాన్ సమయంలో వారి రాక పెరుగుతుంది. ఆ సమయంలో హైదరాబాద్‌లో ఎలాంటి మత ఆంక్షలు లేకపోవడంవల్ల ఏది కావాలంటే అది చేసుకుంటారు. ధనవంతులైన షేక్‌లు ఎల్లప్పుడూ కన్య అమ్మాయిల కోసం వెతుకుతూ ఉంటారు. కన్యలతో సంబంధాలు పెట్టుకుంటే యవ్వనంగా ఉంటామని భావిస్తారు. అంతేకాదు వారు కన్యత్వానికి సాధారణ పరీక్ష చేస్తారు. అమ్మాయి వర్జిన్ కాదా అని ఆమె నాడిని తాకి నిర్ణయించగలరు. రంజాన్ మాసంలోనే చాలా మంది ఏజెంట్లు ఈ పనిలో పాల్గొంటారు. పెళ్లి పేరుతో ఆడపిల్లలను ఒకచోట చేర్చి వారి శరీరం ఎత్తుపల్లాలు కనిపించే విధంగా దుస్తులను అలంకరిస్తారు. ఆ తర్వాత షేక్ ముందు నడిపిస్తారు. ప్రతి ఒక్కరిపై షేక్ రూ.1000, రూ.500 నోట్లు విసురుతుంటాడు. కానీ తనకు కావాలనుకున్న అమ్మాయిపై ఒక రకమైన టోకెన్ విసురుతాడు. అందులో డబ్బుల సంఖ్య ఎంతైన ఉండొచ్చు. 

పెళ్లి చేసుకునేందుకు మూడు రోజులు.. 
ఆడపిల్లలను చూసిన వెంటనే వారు పెళ్లి చేసుకోరు. మూడు రోజులు సమయం తీసుకుంటారు. ఆ మూడు రోజులు తన కలలో ఏ అమ్మాయి తన భార్యగా రావడానికి అర్హురాలు అనేది నిర్ణయించుకుంటారట. అదే సమయంలో అతను ఎవరిపట్ల లైంగికంగా ఎక్కువగా ఆకర్షితుడయ్యాడో కూడా గమనించుకుంటాడట. ఒక్కోసారి అమ్మాయి పెళ్లికి సిద్ధంగా లేకపోతే ఆమె కుటుంబ సభ్యులే చాలా ఒత్తిడి చేసి షాదీ జరిపిస్తారు. హైదరాబాద్ బార్కాస్‌లో ప్రాంతంలో 100 ఇళ్లలో సర్వే చేయగా 33 ఇళ్లలో షేక్ పెళ్లిళ్లు జరిగినట్లు గుర్తించారు. కొన్నేళ్ల క్రితం ఓ అమ్మాయి తనకు 17 పెళ్లిళ్లు చేశారనే అవేదనతో ఆత్మహత్య చేసుకుంది. తన తల్లికి బాధను వర్ణిస్తూ రాసిన లేఖ మీడియాలో వైరల్ అయింది.  

ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టుకోవడం లేదు?
అయితే ఈ దుర్మార్గపు చర్యను రూపుమాపండం మనం అనుకున్నంత సులభం కాదు. ఒక పెళ్లితో కనీసం ఐదు కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ వ్యాపారం మునిగిపోవాలని అక్కడ ఎవరూ కోరుకోరు. మతం, పరువు గురించి అసలే ఆలోచించరు. అయితే 2017 సెప్టెంబర్ లో షేక్‌లు, బ్రోకర్ల నెట్‌వర్క్ మొత్తం పట్టుబడింది. అప్పటి నుంచి వాట్సాప్‌లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. పెళ్లి తర్వాత అమ్మాయిని షేక్ దేశానికి విజిటర్ వీసాపై పంపిస్తారు. అక్కడ ఆమె ఒక నెల లేదా రెండు నెలలు ఉండి తిరిగి వస్తుంది. ఇలాంటి వివాహాలను ఆపాలని చాలాసార్లు ప్రయత్నించామని అధికారులు తెలిపారు. కానీ పాఠశాలలు, హోటళ్లు, ఆసుపత్రులు కూడా బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడానికి సహకరించలేదు. POCSO చట్టం ప్రకారం ప్రతిదీ గోప్యంగా ఉంచాలి కాబట్టి మేము పెద్దగా బహిరంగ పరచలేకపోతున్నాం. ఏది ఏమైనా తల్లిదండ్రులే తమ కూతుళ్లను ఈ పనిలో పడేసారనేది నిజం. ఏజెంట్లు అమ్మాయిలను పని సాకుతో అరేబియాకు పంపి ట్రాప్ లో పడేస్తారని అధికారులు చెప్పారు. 

వివాహాలలో ఖాజీల పెద్ద పాత్ర.. 
గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న పెళ్లిళ్లకు ఖాజీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఖాజీలు తమ ఇళ్లకింద సెల్‌లలో గదులను నిర్మించి.. వీటిని షేక్‌ల అవసరాలకు అనుగుణంగా అలంకరిస్తారు. తాత్కాలిక వీసాపై వచ్చిన షేక్‌లకు పెళ్లి చేసి ఈ గదుల్లోనే ఉంచుతారు. పోలీసులు కూడా వారి టచ్ చేసేందుకు సాహసం చేయడంతో సురక్షితంగా ఉంటున్నారు. 2017లో వందలాది మంది షేక్‌లకు పెళ్లి చేసిన ఓ ఖాజీని అరెస్టు చేయగా.. ఆ తర్వాత వెంటనే విడుదల చేశారు. అయితే ఆ ఖాజీ సమక్షంలోనే డబ్బు లావాదేవీలు జరుగుతున్నట్లు తమకు చాలా వీడియోలు లభించాయని మీడియా బృందం తెలిపింది. 'మేము ఒక ఏజెంట్ ద్వారా ఖాజీని కలవడానికి ప్రయత్నించాం. ముందుగా వీడియో కాల్ చేయమని అడిగాడు. అయితే ఆ కాల్‌లో షేక్ పెళ్లి గురించి తనకు తెలియదని తిరస్కరించాడని చెప్పారు. ఇక ఇది కాలపరిమితి కలిగిన ఒప్పందం. ఇది కొన్ని రోజుల నుండి నెలల వరకు ఉంటుంది. ఉదాహరణకు.. మనం ఎవరితోనైనా కొన్ని రోజులు గడిపి, శాశ్వత సంబంధంలోకి వెళ్లాలనుకుంటే ముతా అనేది ఒక సరైన మార్గం. ఇందులో ఒప్పందం గడువు ఏకకాలంలో ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు సరిపోతారని భావిస్తే కాంట్రాక్టును కూడా పునరుద్ధరించవచ్చు. ఇందులో ఇద్దరికీ పరస్పర అంగీకారం ఉండాలి. ముస్లింలలో షియా సమాజం మాత్రమే దీనిని విశ్వసిస్తుంది. సున్నీలు దీనిని చట్టబద్ధంగా పరిగణించరు. ఇది భారతదేశంలో ఎక్కువగా ఆచరణలో లేదని ఖాజీలు చెప్పినట్లు వారు వెల్లడించారు. 

అనేక చట్టపరమైన లోపాలు..
చట్టపరమైన చిక్కులను అర్థం చేసుకోవడానికి సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది శశాంక్ శేఖర్ ఝాతో కూడా మాట్లాడినట్లు  Aaj Tak తెలిపింది. 'ఇందులో అనేక చట్టపరమైన లోపాలు ఉన్నాయి. వాటి కారణంగా స్వల్పకాలిక వివాహాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. వారికి వివాహాల నమోదుతో అవసరం లేదు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా అనేక పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ముస్లిం చట్టంలోనూ చాలా సమస్యలు ఉన్నాయి. బాలికలతో మైనర్‌ శారీరక సంబంధాన్ని రేప్‌గా పరిగణించాలి. ముస్లిం సమాజం ఈ రకమైన వివాహాలతో చట్టాన్ని విస్మరించింది. దీనిపై నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఆధారంగా ముస్లిం అమ్మాయిల వివాహానికి కనీస వయస్సును నిర్ణయించవచ్చు. పోలీసులు సైతం కేసు నమోదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. షేక్ వివాహంపై హైదరాబాద్‌కు చెందిన సంబంధిత పోలీసు అధికారితో కూడా మాట్లాడటానికి ప్రయత్నించాం. కాని ఎలాంటి స్పందన రాలేదు. 2017లో ఈడీ రాకెట్‌పై చర్యలు తీసుకున్న అధికారి కూడా దీనిపై మాట్లాడేందుకు నిరాకరించారు' అని శశాంక్ శేఖర్ ఝా చెప్పినట్లు మీడియా బృందం వివరించింది. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు