/rtv/media/media_files/2025/04/13/w99662lPJznxdqy9Px40.jpg)
Cricket Betting
Cricket Betting : బెట్టింగ్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. బెట్టింగ్ లో లక్షలు పోగొట్టుకుని ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే బుద్వేల్‌లో చోటు చేసుకుంది.
ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..
క్రికెట్ బెట్టింగ్ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. డబ్బులు అధికంగా వస్తాయన్న ఆశతో బెట్టింగ్‌లో పాల్గొన్న యువకుడు చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన బుద్వేల్‌లో విషాదాన్ని నెలకొల్పింది. బుద్వేల్‌కు చెందిన పవన్ కుమార్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఐపీఎల్ సీజన్ అంటేనే బెట్టింగ్ రాయుళ్లు పండగ చేసుకుంటారు. ఈ ఒక్క ఐపీఎల్ సీజన్ లోనే బెట్టింగ్ దందాలో కోట్లు చేతులు మారతాయి. ఈ బెట్టింగుల ద్వారా ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు యువకులు డబ్బు పోగోట్టుకొని మనస్థాపంతో ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.
పవన్ కడా ఇటీవల జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగ్‌కు లోనయ్యాడు. మొదట్లో స్వల్ప లాభాలు రావడంతో ఆశ పెరిగింది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో అంటే సుమారు 80 వేలు బెట్టింగ్ పెట్టాడు. అయితే.. పెట్టిన మొత్తాన్ని నష్టపోయిన పవన్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. పరిస్థితిని తట్టుకోలేక ఇంటి గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని పవన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎదిగిన కొడుకు బెట్టింగ్ భూతానికి బలవ్వడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!