TGSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ ఆ రూటులో ప్రయాణిస్తే 10 శాతం డిస్కౌంట్

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో మహాలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్రమంతా మహిళలు బస్సులో ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు. ఈ సమయంలో ప్రయాణీకులను ఆకర్శించడానికి సంస్థ ఎండీ సజ్జనార్‌ మరో ఆఫర్‌ ప్రకటించారు.

New Update
  TGSRTC Buses

TGSRTC Buses

TGSRTC : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీఎస్‌ ఆర్టీసీలో మహాలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్రమంతా మహిళలు బస్సులో ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో ఆర్టీసీకి సైతం ఆదాయం గణనీయంగా పెరిగిందట. ఈ సమయంలో ప్రయాణీకులను ఆకర్శించడానికి సంస్థ ఎండీ సజ్జనార్‌ మరో ఆఫర్‌ ప్రకటించారు.

 ఇది కూడా చదవండి: మీ బ్రేక్ ఫాస్ట్‌లో ఈ ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయా?

  ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలిపించిన టీజీఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ ఛార్జీలో రాయితీ ఇస్తామని ప్రకటించింది. అవును మీరు చదివింది నిజమే. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి 10 శాతం రాయితీ ఇస్తామని టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది. అయితే ఇది అన్ని రూట్లలో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇది కేవలం బెంగళూరు- హైదరాబాద్ మార్గంలో ప్రయాణించేవారికి మాత్రమేనని తెలిపింది. బెంగళూరు మార్గంలో నడిచే అన్ని సర్వీసుల్లోనూ ఈ రాయితీని అమలు చేస్తు్న్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. దీనివల్ల ఒక్కొక్క టికెట్‌పై ప్రయాణీకుడు రూ.100 నుంచి రూ.160 వరకు ఆదా చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలుపుతున్నారు. ఈ రూట్లలో బస్సు సర్వీసులను పెంచడంలో భాగంగానే ఈ రాయితీని తీసకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రూట్‌లో ప్రైవేటు ట్రావెల్‌ బస్సులు అధికంగా ప్రయాణిస్తుంటారు. వాటినుంచి ప్రయాణీకులను ఆర్టీసీకి మళ్లించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టికెట్లు ముందస్తు రిజర్వేషన్ కోసం https: //tgsrtcbus.in వెబ్ సైట్‌ని లాగిన్‌ అవ్వాలని కోరారు.  

ఇది కూడా చదవండి: AP News: రాజమండ్రిలో భారీ అగ్నిప్రమాదం.. భయంతో జనం పరుగు

సాఫ్ట్‌వేర్‌ రంగంలో బెంగళూరిది ప్రత్యేక స్థానం. ఇక్కడ తెలంగాణకు చెందిన లక్షలాదిమంది పనిచేస్తున్నారు. వారంతా సెలవులు, వీకెండ్‌కు తరుచుగా హైదరాబాద్‌కు వస్తుంటారు. దానికోసం ఎక్కువగా ప్రైవేటుట్రావెల్స్‌ను ఆశ్రయిస్తుంటారు. అలాగే వ్యాపార నిమిత్తం కూడా చాలామంది ఈ ప్రాంతం నుంచి వెళ్తుంటారు. వారందరిని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అధికారులు ఈ రాయితీని తీసుకు వచ్చారని సమాచారం. 
 Also Read: Gold Prices: బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త...వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు!

ఇది కూడా చదవండి: Road Accident: అయ్యో ఘోరం: కూలీల ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే ముగ్గురు మహిళలు మృతి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: ఏం మనిషివిరా.. దారుణం.. అక్కనే చంపిన తమ్ముడు

హైదరాబాద్‌లోని ఓల్డ్‌ మలక్‌పేటలో కుటుంబ తగాదాలతో అక్కను తమ్ముడు చంపాడు. పాత మలక్‌పేటలో నివాసం ఉంటున్న లక్ష్మిని ఆమె సోదరుడు మదన్‌బాబు కత్తితో దాడి చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
hyd crime

hyd crime

TG Crime: ఆస్తుల తగాదాలు ఈ మధ్య కాలంలో ఎక్కువై పోతున్నాయి. ఇటీవల కాలంలో  కన్నతల్లిదండ్రులతోపాటు తోబుట్టువులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇస్తే ఆస్తి అయినా ఇవ్వు..? లేదా ప్రాణాలైనా ఇవ్వు అన్నట్టు క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. స్థానిక వివరాల ప్రకారం.. 

ఆస్తి కోసం..

హైదరాబాద్‌లోని ఓల్డ్‌ మలక్‌పేటలో కుటుంబ తగాదాలతో అక్కను తమ్ముడు చంపాడు. పాత మలక్‌పేటలో నివాసం ఉంటున్న లక్ష్మిని ఆమె సోదరుడు మదన్‌బాబు కత్తితో దాడి చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న లక్ష్మిని చూసి చుట్టు పక్కన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇది కూడా చదవండి: సన్నటి కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే మందంగా పెరుగుతాయి

ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై స్థానికులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలతోనే లక్షిని చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు


( ts-crime | ts-crime-news | latest-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment